News


31000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 26th June 2019
Markets_main1561532892.png-26581

ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో 0.75శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,809.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రాంరంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోలు మద్దతు లభించడంతో ఇండెక్స్‌ 0.75శాతం (203 పాయింట్లు) పెరిగి 31,054.80 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,847.05)తో పోలిస్తే పావుశాతం(200.65 పాయింట్లు) పెరిగి 31,052.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్‌బీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేయగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు అరశాతం పెరిగాయి. మరోవైపు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు అరశాతం క్షీణించగా,, ఫెడరల్‌ బ్యాంక్‌  0.20శాతం తగ్గింది.
ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 119 పాయింట్ల లాభంతో 39554.76 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 11,835 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

 



You may be interested

జీవిత బీమా తప్పనిసరి!!

Wednesday 26th June 2019

బజాజ్‌ అలియాంజ్‌ సర్వేలో వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జీవిత బీమా కలిగి ఉండటమనేది అత్యంత ప్రాధాన్యత అంశంగా తమ అధ్యయనంలో తేలిందని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ వెల్లడించింది. భారత్‌లో తొలిసారిగా లైఫ్‌ గోల్స్‌ పేరుతో పలు నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 1,681 మంది సర్వేలో పాలుపంచుకున్నారు. వీరిలో 60 శాతం మంది జీవిత బీమాను అత్యంత ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారని బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

పాత కారు.. యమా జోరు!!

Wednesday 26th June 2019

 ఏడాదిలో చేతులు మారినవి 40 లక్షలు కొత్త వాటిని మించిన ప్రీ ఓన్డ్‌ విక్రయాలు తక్కువ ధరకే అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశం దేశంలో మారుతున్న కస్టమర్ల ధోరణి ఏటా 6-7 శాతం వృద్ధితో పురోగతి మరింత ఫోకస్‌ పెడుతున్న తయారీ కంపెనీలు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కార్ల కంటే పాత వాటికే డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2018-19లో 33.7 లక్షల కొత్త కార్లు రోడ్డెక్కగా... అదే సమయంలో ఏకంగా 40 లక్షల పాత

Most from this category