News


బ్యాంకు నిఫ్టీ: నష్టాల్లోంచి లాభాల్లోకి

Wednesday 7th August 2019
Markets_main1565162479.png-27607

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లు తగ్గింపు నేపథ్యంలో బుధవారం మిడ్‌ సెషన్‌ సమాయానికి బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ నేడు 28,053.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ 142 పాయింట్లు నష్టపోయి 27,879.90 వద్ద ఇంట్రాడే కనిస్టాన్ని తాకింది. ఇంట్రాడేలో ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత విధింపుతో బ్యాంకింగ్‌ షేర్లు తిరిగి లాభాల బాటపట్టాయి. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకులకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ కనిష్టస్థాయి(27,879.90) నుంచి 295 పాయింట్లు పెరిగి 28,175.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ క్రితం రోజు ముగింపు(28,022.10)తో పోలిస్తే అరశాతం నష్టంతో 28,154.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా యస్‌ బ్యాంకు షేర్లు 6శాతం పెరిగింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.50శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1.శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1శాతం లాభపడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని పీఎస్‌బీ బ్యాంకు 2.50శాతం వరకు నష్టపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సి్‌స్‌ బ్యాంకు షేర్లు 1శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు అరశాతం నష్టపోయాయి. You may be interested

ఐటి షేర్లు..పాజిటివ్‌గా

Wednesday 7th August 2019

అంతర్జాతీయ పరిణామాలతో పాటు దేశియ కారణాల వలన రూపీ డాలర్‌ మారకంలో భారీగా బలహీనపడడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం 12.39 సమయానికి 1.12 శాతం లాభపడి 15,688.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో మైండ్‌ ట్రీ 6.17 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.85 శాతం, నిట్‌ టెక్‌ 1.78 శాతం, విప్రో 1.12 శాతం, టెక్‌ మహింద్రా 0.78 శాతం, టీసీఎస్‌ 0.73

11150 వరకు నిఫ్టీ పుల్‌బ్యాక్‌ ర్యాలీ?!

Wednesday 7th August 2019

నిపుణుల అంచనా మార్కెట్లలో వచ్చిన భారీ పతనం అనంతరం స్వల్పకాలిక పుల్‌బ్యాక్‌ తప్పదని, ఇందులో భాగంగా షార్ట్‌టర్మ్‌లో నిఫ్టీ 11150 పాయింట్ల వరకు ఎగబాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో గరిష్ఠాల నుంచి సూచీలు ప్రస్తుతం దాదాపు 10 శాతం మేర పతనమయ్యాయి. బుధవారం సూచీలు స్వల్పశ్రేణిలో కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 10800 పాయింట్ల స్థాయి కీలకమద్దతుగా నిలుస్తుందని, స్వల్పకాలిక పుల్‌బ్యాక్‌ అనంతరం సూచీల ప్రవర్తన అంచనా వేయలేమని భావిస్తున్నారు.  వారం రోజుల

Most from this category