News


నష్టాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 29th November 2019
Markets_main1575011440.png-29952

జీవితకాల గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌, శుక్రవారం సెషన్‌లో నష్టాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నం 12.20 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 260.95 పాయింట్లు నష్టపోయి 31,862.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా గత సెషన్‌లో 32,122.95 వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌, శుక్రవారం సెషన్‌లో 32,074.15 వద్ద ప్రారంభమైంది. ఇదే సమయానికి బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ 105.70 పాయింట్లు నష్టపోయి 12,045.45 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 377.77 పాయింట్లు నష్టపోయి 40,752.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 
     నిఫ్టీ బ్యాంక్‌ ఇండక్స్‌లో హెవీవెయిట్‌ షేర్లయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.17 శాతం నష్టపోయి రూ. 513.10 వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.49 శాతం నష్టపోయి రూ. 1,259.15 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 1.73 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.60 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.32 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.18 శాతం, యస్‌ బ్యాంక్‌ 1.14 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 0.67 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.64 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.14 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 5.76 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.27 శాతం మాత్రం లాభపడి ట్రేడవుతున్నాయి.



You may be interested

లాభాల స్వీకరణ: సెన్సెక్స్‌ 466 పాయింట్లు క్రాష్‌

Friday 29th November 2019

134 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ సూచీల జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణకు తోడు నేడు దేశీయ రెండో క్వార్టర్‌ జీడీపీ గణాంకాలల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సూచీలు మిడ్‌ సెషన్‌ కల్లా భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లతో పాటు, అమెరికా ఫ్యూచర్ల నష్టాల ట్రేడింగ్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అన్ని రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒకదశలో సెన్సెక్స్‌ 466 పాయింట్లను కోల్పోయి

డిసెంబర్‌ సీరిస్‌లో టాప్‌ 10 రోలోవర్లు..

Friday 29th November 2019

నిఫ్టీ బ్యాంకులో డిసెంబర్‌ సీరిస్‌ రోలోవర్లు ఎక్కువగా కనిపించాయి. దీంతో నిఫ్టీ కన్నా బ్యాంకునిఫ్టీ డిసెంబర్‌లో మెరుగైన ప్రదర్శన చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. నవంబర్‌లో ఆర్‌ఐఎల్‌, ఐసీఐసీఐ బ్యాంకు లాంటి దిగ్గజాల ర్యాలీ నిఫ్టీ, బ్యాంకునిఫ్టీలను ఆల్‌టైమ్‌హైకి చేర్చింది. నవంబర్‌ సీరిస్‌లో నిఫ్టీకన్నా బ్యాంకు నిఫ్టీ ఎక్కువ లాభం అందించింది. దేశీయ వీఐఎక్స్‌ 15 స్థాయి దిగువకు వచ్చింది. ఫ్యూచర్స్‌లో భారీ షార్ట్‌కవరింగ్‌ను ఎఫ్‌ఐఐలు చేశాయి. డిసెంబర్‌ సీరిస్‌కి నిఫ్టీలో

Most from this category