News


బ్యాంక్‌ నిఫ్టీ 220 పాయింట్లు అప్‌!

Monday 7th October 2019
Markets_main1570426610.png-28752

ఆర్‌బీఐ మరోదపా 25 బీపీఎస్‌(బేసిస్‌ పాయింట్లు) రెపో రేటును తగ్గించడంతో సోమవారం ట్రేడింగ్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గడంతో బ్యాంకింగ్‌ షేర్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. ఉదయం 10.57 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 228.65 పాయింట్లు లాభపడి 28029.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.59 శాతం లాభపడి రూ. 1208.65 వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.89 శాతం లాభపడి రూ. 417.60 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో యెస్‌ బ్యాంక్‌ 3.68 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.61 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.49 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 0.04 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 3.02 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.20 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.57 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.53 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 1.12 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 0.59 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.



You may be interested

ఆరేళ్ల కనిష్టానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Monday 7th October 2019

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సేవలను అందించే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌‍ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం ఉదయం సెషన్‌లో ఆరేళ్ల కనిష్టానికి పతమయ్యాయి. కంపెనీ ప్రధాన ప్రమోటర్‌ ఎస్సెల్‌ మీడియా వెంచర్‌  తన మొత్తం వాటాలో 10.71శాతానికి సమానమైన ఈక్విటీ షేర్లను వీటీబీ క్యాపిటల్‌ వద్ద తనఖా పెట్టినట్లు శుక్రవారం జీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో పునీత్‌ గోయెంకా కంపెనీ తెలిపారు. కంపెనీలో 90శాతం ప్రమోటర్లు కంపెనీ చెందిన 22 శాతం

పెరిగిన పసిడి..!

Monday 7th October 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 5 డాలర్లు పెరిగింది. ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత ఇందుకు కారణమయ్యాయి.  అమెరికా-చైనాల మధ్య ఈ గురు, శుక్ర (10, 11తేదీల్లో) వారాల్లో ఉన్నతస్థాయి చర్చలు జరగనున్నాయి. ఏడాదిన్నర కాలంగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ కుంటుపడటంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా కదులుతోంది. అయితే, అమెరికా ప్రతిపాదినలకు చైనా

Most from this category