News


బ్యాంక్‌ నిఫ్టీ 250 పాయింట్లు అప్‌

Wednesday 17th July 2019
Markets_main1563347117.png-27124

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో దాదాపు 1శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ఈరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,622.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ ఇంట్రాడేలో 250 పాయింట్లు మేర లాభపడింది. 30,800ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యా‍హ్నం గం.12:00లకు ఇండెక్స్‌ గతముగింపు (30,570.80)తో పోలిస్తే 130 పాయింట్లు(దాదాపు అరశాతం) పెరిగి 30,692.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి కోటక్‌ బ్యాంక్ 2.50శాతం, ఐడీఎఫ్‌సీఫస్ట్‌ బ్యాంక్‌ 1.50శాతం, ఎస్‌బీఐ 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌ అరశాతం పెరిగాయి. మరోవైపు ఇదే సమయానికి యస్‌ బ్యాంక్ 4శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 2శాతం నుంచి 1శాతం నష్టపోయాయి. పీఎన్‌బీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. 

ఇదే సమయానికి సెన్సెక్స్‌ 107 పాయింట్లు పెరిగి 39,238 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 11,694 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

క్యు1లో ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న కంపెనీలివే!

Wednesday 17th July 2019

దేశీయ మార్కెట్లోని 84 కంపెనీల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు క్యు1లో వాటాలు పెంచుకున్నారు. ఇలా ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐఓసీ, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఎన్‌ఎండీసీ, ముతూట్‌ ఫైనాన్స్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌ తదితరాలున్నాయి. ఎఫ్‌ఐఐలు వాటాలు పెంచుకున్న నేపథ్యంలో ఈ షేర్లలో కొత్తగా ఎంటర్‌కాదలిస్తే కేవలం ఈ ఒక్క పారామీటర్‌ ఆధారంగా నిర్ణయం

యస్‌బ్యాంకు ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Wednesday 17th July 2019

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌బ్యాంకు బుధవారం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఆస్తుల నాణ్యతలో క్షీణత, బలహీన లోన్‌గ్రోత్‌ కారణంగా బ్యాంకు లాభాల్లో భారీ కోత ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే లాభంలో 80 శాతం పతనం ఉండొచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. దాదాపు రూ.10వేలపైచిలుకు ఒత్తిడిలో ఉన్న ఆస్తుల కారణంగా ప్రొవిజన్లు బాగా పెరిగి రూ. 1208 కోట్లకు చేరవచ్చని అంచనా. ఇందువల్ల

Most from this category