లాభాల్లో బ్యాంక్ నిఫ్టీ
By Sakshi

మార్కెట్ ఒడిదుడుకుల ర్యాలీలో భాగంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతోంది. ప్రైవేట్‌రంగ షేర్ల ర్యాలీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ లాభపడేందుకు దోహదపడుతుంది. ఆర్బీఎల్ అత్యధికంగా 2శాతం, కోటక్ బ్యాంక్ 1.50శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.80శాతం లాభపడ్డాయి. ఎస్బీఐ బ్యాంక్, పీఎన్బీ ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అరశాతం లాభపడ్డాయి. అలాగే ఇదే ఇండెక్స్‌లోని యస్‌బ్యాంక్ షేర్లు 6శాతం నష్టపోయాయి. ఐడీఎఫ్సీ బ్యాంక్ 1శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్ గతముగింపు (28,829.20)తో పోలిస్తే 0.25శాతం(పావుశాతం) లాభంతో 28,841.20ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇదే సమయానికి సెన్సెక్స్ 50 పాయింట్ల స్వల్ప లాభంతో 37318ల వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 11232 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్, అటో, మెటల్, మీడియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియల్టీ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
You may be interested
యూనియన్ బ్యాంక్ క్రాష్
Wednesday 15th May 2019ప్రభుత్వరంగ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇండియా(యూబీఐ) షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో పదిశాతం పతనయ్యాయి. గత ఆర్థిక సంవత్సరపు చివరి త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను ప్రకటించడంతో పాటు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు షేరు కొనుగోలు ధరను తగ్గించడం ఇందుకు కారణం. నేడు బీఎస్ఈలో ఈ బ్యాంకు షేర్లు రూ.75.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మొండిబకాయిలకు అధిక కేటాయింపుల కారణంగా కంపెనీ గతేడాది చివరి త్రైమాసికంలో రూ.3,370 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మొండి
ఏడాది కనిష్టానికి యస్ బ్యాంక్
Wednesday 15th May 2019యస్ బ్యాంకు షేర్లు బుధవారం ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. నేడు బీఎస్ఈలో రూ.154.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో 6శాతం నష్టంతో రూ. 146.85ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఈ ధర షేరు ఏడాది కనిష్ట ధరని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. యస్ బ్యాంక్ అదనపు డైరెక్టరుగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ నియమితులమైన సంగతి