News


బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డు

Wednesday 27th November 2019
Markets_main1574828196.png-29888

గత సెషన్‌లో జీవిత కాల గరిష్ఠాన్ని ఏర్పరిచిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌, బుధవారం సెషన్‌లో ఆ గరిష్ఠాన్ని అధిగమించి మరొక కొత్త రికార్డును ఏర్పరిచింది. గత సెషన్‌లో 31,718.35 పాయింట్ల వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌ బుధవారం సెషన్‌లో 31,832.75 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయంలోనే గత సెషన్‌లో ఏర్పరిచిన 31,796.20 స్థాయిని అధిగమించి 31,893.50    పాయింట్ల వద్ద కొత్త జీవిత కాల గరిష్ఠానికి చేరుకుంది. ఉదయం 9.34 సమయానికి బ్యాంక్‌ నిఫ్టీ 148.90 పాయింట్లు లాభపడి 31860.80  వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ 68.10 పాయింట్లు లాభపడి 12,105.80 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 229.60 పాయింట్లు లాభపడి 41050.90 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
    నిఫ్టీ బ్యాంక్‌ ఇండక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.62 శాతం లాభపడి రూ. 1,283.00    వద్ద ట్రేడవుతుండగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.39 శాతం నష్టపోయి రూ. 508.70 వద్ద ట్రేడవుతోంది. మిగిలిన షేర్లలో ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 0.47 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.25 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 0.03 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన యస్‌ బ్యాంక్‌ 5.86 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 4.25 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.19 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.99 శాతం,  కోటక్‌ బ్యాంక్‌ 0.48 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.46 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 0.58 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. 



You may be interested

హిండాల్కో, ఎయిర్‌టెల్‌.. తదుపరి ర్యాలీకి లీడర్స్‌?!

Wednesday 27th November 2019

నిపుణుల అంచనా నిఫ్టీ సెప్టెంబర్‌ 19 నుంచి 1360 పాయింట్లు ర్యాలీ జరిపి మంగళవారం ఆల్‌టైమ్‌ హైని తాకింది. అయితే ఈ ర్యాలీ విస్తృతమైనది కాదని కేవలం కొన్ని స్టాకుల ప్రదర్శనే సూచీలను నడిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ కవలలు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు షేర్ల దూకుడుతో మార్కెట్లు జీవిత కాల గరిష్ఠాలను చూశాయి. అయితే క్రమంగా ఈ జోరు అన్ని విభాగాల షేర్లకు పాకుతున్న సూచనలు

నిధుల సమీకరణ..యస్‌ బ్యాంక్‌ 5% అప్‌

Wednesday 27th November 2019

నిధుల సమీకరణ కోసం యస్‌ బ్యాంక్‌ బోర్డు డైరక్టర్లు శుక్రవారం సమావేశం కానున్నారు. కొత్తగా ఈక్విటీల ఇష్యు చేసి నిధులను సమీకరించాలని బ్యాంక్‌ బోర్డు భావిస్తోంది. కాగా గతంలో 1.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల కోసం అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ నుంచి బైండింగ్‌ ఆఫర్‌ వచ్చిందని బ్యాంక్‌ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. యస్‌ బ్యాంక్‌ నిధుల సమీకరణ గురించి వార్తలు వెలువడడంతో ఈ బ్యాంక్‌ షేరు బుధవారం సెషన్లో 5.05

Most from this category