News


బ్యాంక్‌ నిఫ్టీ కొత్త రికార్డు!

Tuesday 26th November 2019
Markets_main1574742206.png-29857

గత కొన్ని సెషన్‌ల నుంచి జీవిత కాల గరిష్ఠానికి చేరువలో ట్రేడయిన బ్యాంక్‌ నిఫ్టీ, కొనుగోలు మద్దతు లభించడంతో  మంగళవారం సెషన్‌లో కొత్త ఆల్‌టైం రికార్డును సృష్టించింది. గత సెషన్‌లో 31,555.90 పాయింట్ల వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌ మంగళవారం సెషన్‌లో 31,692.85 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. సెషన్‌ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఈ ఏడాది జూన్‌ 4 న ఏర్పరిచిన 31,752 రికార్డు స్థాయిని అధిగమించి 31,796.20 వద్ద కొత్త జీవిత కాల గరిష్ఠాన్ని నెలకొల్పింది. ఉదయం 9.43 సమయానికి బ్యాంక్‌ నిఫ్టీ 216.46 పాయింట్లు లాభపడి 31772.35 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ 41.35 పాయింట్లు లాభపడి 12115.10 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 179.6 పాయింట్లు లాభపడి 41068.86 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
    నిఫ్టీ బ్యాంక్‌ ఇండక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.41 శాతం లాభపడి రూ. 1,276.35  వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.12 శాతం లాభపడి రూ. 503.40 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.04 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 0.83 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 0.93 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన యస్‌ బ్యాంక్‌ 3.14 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.01 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1.26 శాతం,  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.88     శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.29 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.08 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 0.72 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. 



You may be interested

92 వేలకుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Tuesday 26th November 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ల్లో విశేష స్పందన న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) ఎంచుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 92,000 దాటిందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.  రెండు సంస్థల ఉద్యోగుల నుంచీ ఈ పథకం పట్ల విశేష స్పందన కనిపిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.  బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం

12200 వరకు నిఫ్టీ పరుగు!

Tuesday 26th November 2019

టెక్నికల్స్‌ సంకేతాలు దేశీయ మార్కెట్లు ఈవారాన్ని మంచి లాభాలతో ఆరంభించాయి. మంగళవారం ఆరంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ రికార్డు గరిష్ఠాలను చేరింది. ఇకపై నిఫ్టీకి 12140- 12150 పాయింట్ల రేంజ్‌లో చిన్న పాటి అవరోధం ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆ పైన 12200 పాయింట్లను చేరడం ఖాయంగా సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటికే 12వేలు, 12100 పాయింట్ల కాల్‌రైటర్లు తమ షార్ట్స్‌ను కవర్‌ చేసుకోవడం ఆరంభించారు. నిఫ్టీ 12200- 12250పాయింట్లు చేరిన తర్వాత ప్రాఫిట్‌

Most from this category