News


ఒడిదుడుకుల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 8th January 2020
Markets_main1578457604.png-30756

బ్యాంకు నిఫ్టీలో స్వల్ప రికవరీ
బుధవారం బ్యాంకు నిఫ్టీ ఆరంభంలో దాదాపు 500 పాయింట్లు నష్టపోయి 30899 పాయింట్ల కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే అనంతర ట్రేడింగ్‌లో క్రమంగా కోలుకొని 31220 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో దాదాపు 300 పాయింట్ల నష్టం నుంచి రికవరీ చెందినట్లయింది. కానీ ఈ రికవరీ తాత్కాలికమేనని బ్యాంకు నిఫ్టీ కీలక రైజింగ్‌ వెడ్జ్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకు నిఫ్టీలో మరింత పతనం ఉండే అవకాశాలున్నాయంటున్నారు. దిగువన బ్యాంకు నిఫ్టీకి 30800, 30500 పాయింట్ల వద్ద మద్దతు లభించనుంది. సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంకు మాత్రమే ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి. మిగిలిన షేర్లు దాదాపు 0.5- 1.0 శాతం నష్టంలో ఉన్నాయి. పీఎస్‌యూ బ్యాంకు సూచీ దాదాపు 1.5 శాతం నష్టంతో 2382 పాయింట్ల వద్ద, ప్రైవేట్‌ బ్యాంకు నిఫ్టీ సూచీ 0.37 శాతం నష్టంతో 17320 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ప్రధాన సూచీ నిఫ్టీ ఒక దశలో భారీగా నష్టపోయినా మరలా కోలుకొని ప్రస్తుతం 12000 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

రూ.41,000 పైకి పసిడి

Wednesday 8th January 2020

4 ట్రేడింగ్‌ సెషన్లలో రూ.2000 ర్యాలీ  దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో బుధవారం పసిడి ఫ్యూచర్ల ధర రూ.41వేల అందుకుంది. మధ్యప్రా‍చ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఏడేళ్ల గరిష్టానికి చేరుకోవడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 20పైసలు బలహీనపడటం తదితర కారణాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో  10గ్రాముల పసిడి ధర నిన్నటి ముగింపు(రూ.40,663)తో పోలిస్తే రూ.615లు

72 దిగువకు రూ’పాయ్‌

Wednesday 8th January 2020

ఇరాన్‌ దాడుల ఎఫెక్ట్‌ ప్రారంభంలోనే 20 పైసలు డౌన్‌ ముందుగా హెచ్చరించిన విధంగా ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలపై మిసైళ్లతో ఇరాన్‌ తాజాగా దాడులు చేయడంతో దేశీ కరెన్సీకి మరోసారి దెబ్బ తగిలింది. దీంతో ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి 20 పైసలు నీరసించింది. 72.02 వద్ద మొదలైంది. వెరసి రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి సాంకేతికంగా కీలకమైన 72 మార్క్‌ దిగువకు చేరింది. ప్రస్తుతం 18 పైసలు(0.25

Most from this category