News


బ్యాంకింగ్‌ షేర్ల ప్రారంభ జోరు

Thursday 9th January 2020
Markets_main1578542816.png-30788

గురువారం ఆరంభంలో బ్యాంకు నిఫ్టీ దాదాపు ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. బుధవారం క్లోజింగ్‌ 31373 పాయింట్ల నుంచి దాదాపు 400 పాయింట్ల లాభంతో 31748 పాయింట్ల వద్ద ఆరంభమైన సూచీ 31885 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. 9.30 నిమిషాలకు 31818 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సూచీలోని షేర్లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా ఆర్‌బీఎల్‌ బ్యాంకు 3.21 శాతం లాభంతో ఉంది. పీఎస్‌యూ బ్యాంకు సూచీ 1.7 శాతం లాభంతో 2443 పాయింట్ల వద్ద, ప్రైవేట్‌ బ్యాంకు నిఫ్టీ సూచీ 1.37 శాతం లాభంతో 17608 పాయింట్ల వద్ద కదలాడుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు పాజిటివ్‌గా మారడంతో గురువారం సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లు బలంగా ఉండడం, రాత్రి అమెరికా మార్కెట్లు లాభంలో క్లోజవడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తుండడంతో దేశీయ మార్కెట్లు మంచి లాభాలతో ఉన్నాయి. నిఫ్టీ దాదాపు 132 పాయింట్ల లాభంతో 12150 పాయింట్ల పైన ట్రేడవుతోంది. క్రూడ్‌ ధర చల్లారడం, బంగారం ధర దిగిరావడం మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంట్‌ను పెంచింది. 



You may be interested

గృహ రుణాల వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలి

Thursday 9th January 2020

90 శాతం మేర రుణం ఇవ్వాలి స్టాంప్‌ డ్యూటీ 50 శాతానికి తగ్గించాలి ప్రి బడ్జెటరీ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రికి నరెడ్కో విన్నపం సాక్షి, న్యూఢిల్లీః- గృహ రుణాల వడ్డీ రేటు 7 శాతానికి తగ్గించాలని, అమ్మకాలను మరింతగా ప్రోత్సహించేందుకు 6 శాతంపైబడి వడ్డీ చెల్లించే ప్రతి ఒక్కరికీ వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించింది. యూనియన్‌ బడ్జెట్‌

జియో నుంచి వై-ఫై కాలింగ్‌ సేవలు

Thursday 9th January 2020

న్యూఢిల్లీ: వై-ఫై ద్వారా కూడా వాయిస్‌, వీడియో కాలింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లల్లో లేదా ఆఫీసుల్లో కాల్స్‌ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై-ఫైకి మారవచ్చని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్‌)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో

Most from this category