News


బ్యాంక్‌ నిఫ్టీ లాభం 1000 పాయింట్లు

Monday 23rd September 2019
Markets_main1569213141.png-28487

కేంద్ర ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి శుక్రవారం తగ్గించిన విషయం తెలిసిందే. దీని ఫలితంగా శుక్రవారం దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు ఆల్‌టైం గరిష్ఠాలకు చేరుకున్నాయి. బుల్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో కూడా తమ పట్టును బిగిస్తున్నారు. ట్రేడింగ్‌ ప్రారంభంలో దేశీయ సూచీలు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.49 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1060.20 పాయింట్లు లాభపడి 30 వేల మార్కును(30051.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది) దాటింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7.41 శాతం లాభపడి రూ.1524.75 వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.96 శాతం లాభపడి రూ. 1247.15 వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.75 శాతం లాభపడి రూ. 433.15 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఇండెక్స్‌లో ఇతర షేర్లయిన ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 5.63 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.40 శాతం, కోటక్‌ బ్యాంక్‌  2.84 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.89 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.64 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 1.22 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 0.93 శాతం,  ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 0.70 శాతం లాభపడి ట్రేడవుతుండగా, రుణాల ఊబిలో చిక్కుకొని సతమతమవుతున్న యెస్‌ బ్యాంక్‌ మాత్రం 0.90 శాతం నష్టపోయి ట్రేడవుతోంది. 
 



You may be interested

ఐటీసీ 9.5 శాతం అప్‌

Monday 23rd September 2019

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ సోమవారం ప్రారంభంలోనే 9శాతానికి పైగా లాభపడింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.249.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతవారంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పొగాకు ఉత్పత్తులపై శ్లాబ్‌ను పెంచవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. కౌన్సిల్‌ పొగాకు ఎలాంటి రేటును పెంచకపోవడంతో పాటు హోటల్‌ గదులపై జీఎస్‌టీ తగ్గించింది. ఇక కేంద్రం ప్రకటించిన కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా ఐటీసీ

ఈ సమయంలో అనుకూలమైన పథకం

Monday 23rd September 2019

స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తితో ఉన్నవారు ప్రస్తుత సమయంలో తప్పకుండా తమ పెట్టుబడులు కొనసాగించడం ఎంతో అనుకూలం. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంలో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎంతో దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో వాటి విలువలు అత్యంత ఆకర్షణీయమైన స్థాయికి చేరాయి. ఫలితంగా ఈ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల ధరలు కూడా తగ్గాయి. స్మాల్‌క్యాప్‌ విభాగంలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచి

Most from this category