STOCKS

News


ఆర్‌బీఐ ఎఫెక్ట్‌: బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం జంప్‌

Thursday 6th February 2020
Markets_main1580972133.png-31564

అందరూ ఊహించనట్లుగానే కీలక వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యథాతథ పాలసీకే కట్టుబడి ఉన్నట్లు ప్రకటించడంతో గురువారం మిడ్‌సెషన్‌ అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు అనుహ్య మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 
470పాయింట్లు(1.51శాతం) లాభపడింది. నేడు ఆర్‌బీ పాలసీ ప్రకటన నిర్ణయం వెలువడునున్న నేపథ్యంలో మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు స్తబ్దుగా ట్రేడ్‌ అయ్యాయి. వడ్డీరేట్లపై ఆర్‌బీఐ యథాతథ పాలసీని ప్రకటించిన అనంతరం వడ్డీరేట్లకు ప్రభావితమయ్యే బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టే‍ట్‌, అటో, ఆర్థిక రంగ షేర్లలో అనూహ్యంగా కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభించింది. మధ్యాహ్నం 1:45ని.లకు ఇండెక్స్‌ నిన్నటి ముగింపు(31,001.95)తో పోలిస్తే 1శాతం లాభంతో పోలిస్తే 31,340.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 4.50శాతం లాభపడింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 4శాతం పెరిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, యస్‌బ్యాంక్‌ బ్యాంక్‌ ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1శాతం మేర ర్యాలీ చేశాయి. 



You may be interested

52 వారాల గరిష్టానికి 52 షేర్లు

Thursday 6th February 2020

గురువారం స్టాక్‌మార్కెట్‌లో 52 వారాల గరిష్టానికి 52 షేర్లు ర్యాలీ చేశాయి. 52 వారాల గరిష్టానికి చేరిన షేర్లలో అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఏజీసీ నెట్‌వర్క్‌, అజంతా ఫార్మా, అల్కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, అర్మాన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, అతుల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, చోళమండలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, డాబర్‌ ఇండియా, దివీస్‌ లేబొరేటరీస్‌, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌, ఎడిల్వీజ్‌

యథాతథ రేట్ల కొనసాగింపు: ఆర్‌బీఐ

Thursday 6th February 2020

ప్రస్తుత 5.15 శాతం వద్దే రెపో రేటు అమలు వచ్చే ఏడాది జీడీపీ 6 శాతం వృద్ధి అంచనా మూడో రోజులపాటు సమావేశాలు నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మరోసారి యథాతథ విధానాల అమలుకే కట్టుబడింది. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.15 శాతం వద్దనే కొనసాగనుంది. దీంతో రివర్స్‌ రెపో రేటు సైతం​4.9 శాతంగా కొనసాగనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌  గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అధ్యక్షతన ఎంపీసీ ద్వైమాసిక పరపతి విధాన

Most from this category