News


బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం క్రాష్‌

Monday 24th February 2020
news_main1582525705.png-32038

బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.50 శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ గురువారం నాటి ముగింపు(30,942.85)తో పోలిస్తే 276.5 పాయింట్ల నష్టంతో 30,666.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌ పతనంలో భాగంగా ప్రభుత్వ బ్యాంక్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోను కావడంతో ఒక దశలో 476పాయింట్లు(1.53శాతం) నష్టపోయి 30466.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ మునపటి ముగింపు(30,666.35)తో పోలిస్తే 1శాతం నష్టంతో 30,606.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా 2.50శాతం నష్టపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 2శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.50శాతం క్షీణించగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ అరశాతం, యస్‌ బ్యాంక్‌ షేర్లు 0.10శాతం పతనమయ్యాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేరు అరశాతం, ఎస్‌బీఐ షేర్లు 0.25శాతం లాభపడ్డాయి. 



You may be interested

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా​ 12 శాతం జంప్‌

Monday 24th February 2020

సోమవారం జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా షేరు 12 శాతం పెరిగి, 26.45 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది. జీఎంఆర్‌ గ్రూప్‌ ఎయిర్‌పోర్టు బిజినెస్‌ లోని 49 శాతం వాటాను ఫ్రాన్స్‌కు చెందిన ఏడీపీ గ్రూపుకు విక్రయించేందుకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతివ్వడంతో షేరు ధర పెరిగింది. గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా రెగ్యులేటరీ అథారిటీ వేగంగా అనుమతిచ్చింది.   

అరబిందో ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Monday 24th February 2020

15 శాతం పతనమైన షేరు గత వారం అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) ఈఐఆర్‌ జారీ చేసిన వార్తలతో రివ్వున పైకెగసిన హెల్త్‌కేర్‌ రంగ హైదరాబాద్‌ కంపెనీ అరబిందో ఫార్మా కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో 10.30 ప్రాంతంలో అరబిందో షేరు 15 శాతం పతనమై రూ. 509 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో అమ్మకాలు పెరిగి రూ. 490 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.

Most from this category