News


బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు- బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌..!

Thursday 30th January 2020
Markets_main1580366571.png-31334

మార్కెట్‌ పతనంలో భాగంగా గురువారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 1శాతం(317 పాయింట్లు) వరకు నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 30,889.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో ప్రైవేట్‌ రంగ షేర్లైన యస్‌ బ్యాంక్‌(6 శాతం), ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌(5 శాతం), ఆర్‌బీఎల్‌(3శాతం), అత్యధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌(1 శాతం) షేర్లతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ షేరు 1శాతం పతనం కావడం ఇండెక్స్‌ను నష్టాల బాట పట్టించింది. ఫలితంగా ఒక దశలో 317 పాయింట్లు నష్టపోయి 30,559.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:45ని.లకు ఇండెక్స్‌ 0.67శాతం నష్టంతో 30,670.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 254 పాయింట్లు నష్టపోయి 41వేల దిగువన 40,944.15 వద్ద, నిఫ్టీ 76.30 పాయింట్లను కోల్పోయి 12,053.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

గోద్రేజ్‌ కన్జూమర్‌ 6 శాతం డౌన్‌

Thursday 30th January 2020

దేశీయ ప్రముఖ గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌ కంపెనీ  డిసెంబర్‌తో ముగిసిన క్యూ3 ఫలితాల్లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5.11 శాతం పెరిగి రూ.445.20  చేరినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ క్రెడిట్‌ సూసీ న్యూట్రల్‌ రేటింగ్‌ను ఇవ్వడంతో గురువారం మధ్యహ్నం 12.30 గంటల ప్రాంతంలో గ్రోద్రేజ్‌ షేర్లు 6 శాతం పడిపోయి 696.30 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 

స్పెషాలిటీ కెమికల్‌ షేర్ల జోరు

Thursday 30th January 2020

కరోనా వైరస్‌ కారణంగా దేశీ కంపెనీలకు లబ్ది  ఏడాది గరిష్టాలకు స్పెషాలిటీ కెమికల్‌ షేర్లు తాజాగా ప్రపంచ అత్యవసర పరిస్థితికి తెరతీస్తున్న చైనీస్‌ కరోనా వైరస్‌ దేశీ కంపెనీలకు లబ్ది చేకూర్చనున్న అంచనాలు పెరుగుతున్నాయి. చైనీస్ హుబే ప్రొవిన్స్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ఇటీవల పలు దేశాలకు విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతోంది. దీంతో దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలకు ఆర్డర్లు పెరిగే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా బ్రోకింగ్‌

Most from this category