News


గరిష్టస్థాయి నుంచి బ్యాంక్‌ నిఫ్టీ 400 పాయింట్లు డౌన్‌

Tuesday 1st October 2019
Markets_main1569904508.png-28647

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఆరంభలాభాల్ని కోల్పోయింది. నేడు ఇండెక్స్‌ 123 పాయింట్ల లాభంతో 29,226.15 వద్ద మొదలైంది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1.50శాతం(423 పాయింట్లు) పెరిగి 29526.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అనంతరం అనూహ్యం‍గా బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ గరిష్టస్థాయి(29526.40) నుంచి పతనమైంది. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్‌ లాభాలు హరించుకుపోయి అరశాతం స్వల్పలాభంతో 29,234.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 4శాతం నష్టపోయింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 3శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 2.50శాతం నష్టపోయాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు యస్‌బ్యాంక్‌ 1.50శాతం లాభపడింది. ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1శాతం పెరగ్గా, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయింది. 



You may be interested

60 డాలర్ల దిగువకు క్రూడ్‌

Tuesday 1st October 2019

   యూఎస్‌, రష్యా దేశాల చమురు ఉత్పత్తి సెప్టెంబర్‌ నెలలో పడిపోవడంతో మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. అయినప్పటికి ట్రేడ్‌వార్‌ కారణంగా అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.16 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.76 శాతం​లాభపడి బారెల్‌ 59.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ 0.91 శాతం

70.73 వద్ద రూపీ ప్రారంభం​

Tuesday 1st October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం ట్రేడింగ్‌లో 14 పైసలు బలపడి 70.73 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో చమురు ధరలు తగ్గినప్పటికి, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో రూపీ డాలర్‌ మారకంలో 31 పైసలు బలహీనపడి 70.87 వద్ద ముగిసింది. యూఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనల వలన ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకోడానికి ఇష్టపడడం లేదని విశ్లేషకులు తెలిపారు. దీంతోపాటు గత సెషన్లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ల

Most from this category