News


బ్యాంక్‌ నిఫ్టీ డౌన్‌

Friday 3rd January 2020
Markets_main1578030256.png-30645

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగులో కదులుతున్నాయి. గురువారం రాత్రి బాగ్దాద్‌పై అమెరికా చేపట్టిన వైమానిక దాడులలో ఇరాన్‌, ఇరాక్‌ అధికారులు కొంతమంది మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు రివ్వుమన్నాయి. దీంతో దేశీయంగా చమురు దిగుమతుల బిల్లు పెరగనుందన్న అంచనాలు పెరిగి రూపాయి డీలాపడింది. దీనికితోడు ఈ ఏడాదిలో డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను ప్రభుత్వం చేరకపోవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇవన్నీ ద్రవ్యలోటు పెరిగేందుకు దారిచూపుతాయని.. దీంతో ఈ ప్రభావం బ్యాంకులపై కనిపించే వీలున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అటు పీఎస్‌యూ, ఇటు ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. వివరాలు చూద్దాం..

పీఎస్‌యూ బ్యాంక్స్‌ డౌన్‌
ఉదయం 11 ప్రాంతంలో సెన్సెక్స్‌ 130 పాయింట్లు క్షీణించి 41,496కు చేరగా.. నిఫ్టీ 41  పాయింట్ల వెనకడుగుతో 12,241 వద్ద ట్రేడవుతోంది. అయితే మార్కెట్లను మించుతూ ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం నీరసించింది. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.4 శాతం, ప్రయివేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.9 శాతం చొప్పున డీలా పడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లలో బీవోబీ, కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐవోబీ 2.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఇండియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ సింద్‌ బ్యాంక్‌ 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇక ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో ఆర్‌బీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, సిటీ యూనియన్‌, ఇండస్‌ఇండ్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ 2.6-0.5 శాతం మధ్య నష్టపోయాయి. యస్‌ బ్యాంక్‌ మాత్రం 0.4 శాతం లాభపడి ట్రేడవుతోంది.



You may be interested

బ్యాంకుల నెత్తిన రూ. 30వేల కోట్ల భారం!

Friday 3rd January 2020

పెరగనున్న మొండిపద్దుల కేటాయింపులు కొత్త ఏడాదిని దేశీయ బ్యాంకులు దాదాపు రూ. 30వేల కోట్ల ప్రొవిజన్ల కేటాయింపుతో ఆరంభించనున్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, రిలయన్స్‌ అనీల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలు, సీసీడీ, సీజీ పవర్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు సంబంధించి బ్యాంకులు ఈ మొత్తాన్ని తమ పద్దు పుస్తకాల్లో కేటాయించాల్సిఉంటుంది. వీటిలో ఏ అకౌంట్‌కు సంబంధించి ఇంతవరకు సెటిల్‌మెంట్‌ జరగలేదు. దీంతో డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకుల ప్రొవిజనింగ్స్‌ పెరగనున్నాయి. ఈ కేటాయింపుల్లో అధికభాగం

ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్ల పతనం

Friday 3rd January 2020

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో, బీపీసీఎల్‌ వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని ప్రభుత్వ ఉన్నధికారి ఒకరి చెప్పడంతో దేశీయంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నష్టాల్లో బాట పట్టాయి. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 3శాతం నష్టపోగా, ఐఓసీ మాత్రం​ అరశాతం దాకా నష్టపోయింది.   శుక్రవారం వేకువజామున అమెరికా జరిపిన దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు. రాకెట్ దాడిలో ఇరాన్‌

Most from this category