News


బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం డౌన్‌

Monday 27th January 2020
Markets_main1580098047.png-31225

కరోనా వైరస్‌ ధాటికి ముడిచమురు ధరలతోపాటు.. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బలహీనపడుతున్నాయి. మరోపక్క రక్షణాత్మక పెట్టుబడి సాధనాలుగా భావించే పసిడి, జపనీస్‌ కరెన్సీ యెన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. కరోనా వైరస్‌ ఇతర దేశాలకూ పాకుతున్న వార్తలతో తాజాగా జపనీస్‌ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తగా.. యూఎస్‌ ఫ్యూచర్స్‌ సైతం నేలచూపులతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 249 పాయింట్లు క్షీణించి 41,364కు చేరగా.. నిఫ్టీ 77 పాయింట్ల వెనకడుగుతో 12,171 వద్ద ట్రేడవుతోంది. కాగా.. అటు పీఎస్‌యూ, ఇటు ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో అమ్మకాలు పెరగడంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం నీరసించింది. వివరాలు చూద్దాం..

పీఎస్‌యూ బ్యాంక్స్‌ డీలా
పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లలో బీవోబీ, ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎస్‌బీ, పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంక్‌ 2.3-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే సెంట్రల్‌ బ్యాంక్‌ 2.3 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 0.8 శాతం చొప్పున పుంజుకున్నాయి. కాగా.. మరోవైపు ప్రయివేట్‌ బ్యాంక్‌ కౌంటర్లలో కొటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 2-0.5 శాతం మధ్య నష్టపోయాయి. ఇందుకు విరుద్ధంగా యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి.



You may be interested

12430 పాయింట్లు దాటితేనే ర్యాలీ!

Monday 27th January 2020

నిఫ్టీపై నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు సోమవారం నెగిటివ్‌గా ఆరంభమయ్యాయి. నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టీకి దాదాపు 12100- 12150 పాయింట్ల రేంజ్‌లో 50 రోజుల డీఎంఏ వద్ద మద్దతు దొరుకుతోంది. ప్రస్తుతానికి నిఫ్టీ స్వల్పకాలిక 5,10, 20 డీఎంఏలకు దిగువన ఉంది. నిఫ్టీకి తక్షణ నిరోధం 12290, 12335 పాయింట్ల వద్ద ఎదురవుతుందని ఎంఎస్‌టీఏ నిపుణుడు మిలాన్‌ వైష్ణవ్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఐ ప్రస్తుతం న్యూట్రల్‌ నుంచి

12200 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Monday 27th January 2020

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 102.51 పాయింట్ల నష్టంతో 41,510.68 వద్ద, నిఫ్టీ 12200 దిగువన 51పాయింట్ల నష్టంతో 12,197.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  కరోనా వైరస్ వ్యాప్తి చైనా ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ వృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుందనే ఆందోళనలతో పాటు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న అమెరికా రిజర్వ్‌ బ్యాంకు సమావేశాల నేపథ్యంలో అప్రమత్తతతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన

Most from this category