News


బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం డౌన్‌

Tuesday 23rd July 2019
Markets_main1563856216.png-27243

ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అరశాతం క్షీణించింది. నేడు ఈ ఇండెక్స్‌ 29,342.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అధిక వెయిటేజీ కలిగిన యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల 2.50శాతం నష్టపోవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 0.65శాతం (190 పాయింట్లు) క్షీణించి 29,095.50 పాయింట్ల కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.9:30ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(29,284.95)తో పోలిస్తే 108 పాయింట్లు(0.38) క్షీణించి 29,214.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నష్టపోయాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1.50శాతం పతనమయ్యాయి. పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంకు షేర్లు 1నుంచి అరశాతం క్షీణించాయి. మరోవైపు కోటక్‌ బ్యాంక్‌ 2శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.50శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంకు షేర్లు అరశాతం వరకు లాభపడ్డాయి. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌కు 29000 వద్ద కీలక మద్దతు స్థాయి, 29300 వద్ద కీలక నిరోధస్థాయి ఉన్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇదే సమయానికి ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 50 పాయింట్ల లాభంతో 38,080 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 11,352.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

కొత్త జీవితకాల గరిష్టానికి ఇన్ఫోసిస్‌

Tuesday 23rd July 2019

కలిసొచ్చిన రూపాయి బలహీనత దేశీయ ఐటీ సేవల దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.785.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో డాలర్‌ మారకంలో రూపాయి మారకం విలువ 12 పైసలు నీరసించడంతో ఐటీ కంపెనీల షేర్లకు కలిసొస్తుంది. అందులో భాగంగా నేడు ఇన్ఫోసిస్‌ షేర్లు దాదాపు 2.50శాతం మేర

బలహీనంగా రూపీ..68.98 వద్ద ప్రారంభం

Tuesday 23rd July 2019

చమురు ధరలు పెరగడంతో పాటు, అమెరికా డాలర్‌ బలపడడంతో రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 6 పైసలు బలహీనపడి డాలర్‌ మారకంలో 68.98 వద్ద ప్రారంభమైంది. గత వారం ఇరాన్ బ్రిటిష్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన నేపధ్యంలో గత సెషన్‌లో చమురు ధరలు పెరిగాయి. దీంతోపాటు లిబియా తన అతిపెద్ద చమురు క్షేత్రంలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడం గమనర్హం.  గత సెషన్‌లో రూపీ డాలర్‌

Most from this category