News


స్వల్ప నష్టాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 12th July 2019
Markets_main1562917818.png-27015

స్తబ్ధుగా సాగుతున్న మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ స్వల్పంగా నష్టపోయింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల పతనం ఇందుకు కారణమైంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లుకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,789.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తదుపరి అరశాతం క్షీణించి 164 పాయింట్లు క్షీణించి 30548.30 స్థాయి వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 12:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(30,716.55)తో పోలిస్తే ఇండెక్స్‌ 30632 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అధిక వెయిటేజి కలిగిన యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఆర్‌బీఎల్‌, పీఎన్‌బీ, ఫెడరల్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం లాభపడ్డాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 1శాతం పెరగ్గా, ఇండస్‌ ఇండ్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు లాభపడ్డాయి. 
ఇక ఇదే సమయానికి నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 11,618.90 వద్ద, సెన్సెక్స్‌ 118.52 పాయింట్లు లాభపడి 38,941.63 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

మెటల్‌ షేర్ల మెరుపులు

Friday 12th July 2019

ట్రేడవార్‌ భయాలు తగ్గడంతో పాటు అమెరికా ఫెడరల్‌ రిజర్వు బ్యాంక్‌ వడ్డి రేట్లను తగ్గించనుందనే వార్తల నేపథ్యంలో దేశియ మెటల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.68  శాతం లాభపడి 2,852.35 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మెటల్‌ ఇండెక్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 4.67 శాతం, టాటా స్టీల్‌ 3.07 శాతం, వేదాంత లి. 2.63 శాతం, సెయిల్‌ 2.46 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ)

మొబైల్‌ రీసైకిల్‌ చేస్తున్నది 12 శాతమే

Friday 12th July 2019

 హైదరాబాద్‌ వినియోగదార్లపై 91మొబైల్స్‌ సర్వే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను పట్టించుకోని కస్టమర్లు ఇళ్లలో పేరుకుపోతున్న పాత మొబైల్‌ ఫోన్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న హైదరాబాద్‌ కస్టమర్లలో 12 శాతం మంది మాత్రమే స్వచ్చందంగా తమ డివైస్‌ను రీసైక్లింగ్‌కు ఇస్తున్నారు. కొత్త మోడల్‌ కొంటున్న సమయంలో 9 శాతం మంది పాత ఫోన్‌ను విక్రేతకు ఇస్తున్నారని గ్యాడ్జెట్‌ డిస్కవరీ సైట్‌ 91మొబైల్స్‌.కామ్‌ సర్వేలో తేలింది. ఈ-వేస్ట్‌ కంపెనీ సెరెబ్రా గ్రీన్‌, మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌

Most from this category