News


గరిష్టం నుంచి 1శాతం క్షీణించిన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 5th September 2019
Markets_main1567665776.png-28214

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులను లోనైంది. నేడు 27,086.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ 120 పాయింట్ల పెరిగి 27243.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇండెక్స్‌ గరిష్టస్థాయి(27243.95) నుంచి 285 పాయింట్లు(1శాతం) నష్టపోయి 26,959.10 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యా్‌హ్నం గం.11:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,123.85)తో పోలిస్తే అరశాతం నష్టంతో 27000 స్థాయి దిగువున 26,997.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ 2శాతం నష్టపోయింది. యస్‌బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం క్షీణించాయి. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం పతనమయ్యాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని పీఎన్‌బీ షేర్లు 2శాతం, యస్‌బ్యాంక్‌ షేర్లు 1శాతం, ఐడీఎఫ్‌సీఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

ఈ షేర్లపై బడా బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Thursday 5th September 2019

నాలుగు లార్జ్‌క్యాప్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా ఉన్నాయి. లాంగ్‌టర్మ్‌కు వీటిని సిఫార్సు చేస్తున్నాయి. 1. ఇన్ఫోసిస్‌: యూబీఎస్‌ సిఫార్సు- కొనొచ్చు. టార్గెట్‌ రూ. 850. మార్జిన్‌ మెరుగుదలతో ప్రదర్శన మెరుగుపడుతుంది. బలహీన డిమాండ్‌ సమయాన ఇన్ఫీ బలమైన రక్షణాత్మక షేరుగా నిలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మంచి రెవెన్యూ వృద్ధి అవకాశాలున్నాయి. 2. లుపిన్‌: మోర్గాన్‌స్టాన్లీ సిఫార్సు- ఓవర్‌వెయిట్‌. టార్గెట్‌ రూ. 1003. ప్రస్తుత స్థానం నుంచి రీరేటింగ్‌ ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి.

చిన్న స్టాకులు ఆకర్షణీయం!

Thursday 5th September 2019

కోటక్‌ మహీంద్రా ఏఎంసీ డైరెక్టర్‌ నీలేశ్‌ షా వాల్యూషన్ల పరంగా మార్కెట్లు చౌకగా ఉన్నాయని, ముఖ్యంగా స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ డైరెక్టర్‌ నీలేశ్‌ షా చెప్పారు. లార్జ్‌క్యాప్స్‌ సైతం సరసమైన వాల్యూషన్ల వద్ద ఉన్నాయని, సూపర్‌ లార్జ్‌క్యాప్స్‌ మాత్రం ఇంకా ఖరీదుగానే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లు నెగిటివ్‌ నుంచి న్యూట్రల్‌ ధృక్పథంలో కదలాడుతున్నాయని తెలిపారు. ఎర్నింగ్స్‌ అంచనాలను అందుకోలేకపోవడం, వివిధ టాక్సులు మార్కెట్‌ సెంటిమెంట్‌పై

Most from this category