STOCKS

News


బ్యాంకు నిఫ్టీ 1.50శాతం డౌన్‌..!

Monday 22nd July 2019
Markets_main1563771671.png-27215

మార్కెట్‌ పతనంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 1.50శాతం క్షీణించింది. నేడు బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 29,617.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇటీవల బ్యాంకింగ్‌ రం‍గంలో నెలకొన్న ఆస్తుల నాణ్యత ఆందోళనలు, ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకుల క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను తీవ్ర నిరాశపరచడటంతో పాటు ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 3శాతం పతనం కావడంతో ఇండెక్స్‌ భారీగా క్షీణించింది. ఒక దశలో దాదాపు 500పాయింట్లు నష్టపోయి (1.60శాతం) 29,378.85 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఉదయం గం.10:10ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(29,378.85)తో పోలిస్తే 1.20శాతం పతనమై 29,275.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 3.50శాతం నష్టపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.50శాతం, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం పతనమయ్యాయి. ఫెడరల్‌ బ్యాంక్‌ ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం క్షీణించాయి. మరోవైపు యస్‌ బ్యాంక్‌ షేర్లు 8శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ 1శాతం, పీఎన్‌బీ, యాక్సిస్‌ బ్యాంక్‌ బ్యాంకు ఆఫ్‌ బరోడా షేర్లు అరశాతం లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 0.10శాతం స్వల్పంగా పెరిగింది. నేడు బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌కి  29300 వద్ద కీల వద్ద ధర ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి.You may be interested

యస్‌ బ్యాంక్‌ 7 శాతం అప్‌

Monday 22nd July 2019

గత కొన్ని సెషన్‌లలో నష్టపోయిన యస్‌ బ్యాంక్‌ షేరు  సోమవారం ట్రేడింగ్‌లో 7.69  శాతం లాభపడి రూ. 89.65 వద్ద ట్రేడవుతోంది. ఈ  షేరు రూ. 83.30 వద్ద ప్రారంభమవ్వగా గత సెషన్‌లో రూ. 83.25 వద్ద ముగిసింది. ఇంట్రాడే గరిష్ఠస్థాయి, కనిష్ఠస్థాయి  రూ. 90.45, రూ. 81.70లకు చేరుకుంది. ఉదయం 10.51 సమయానకి 6.43 శాతం లాభపడి 88.60 వద్ద ట్రేడవుతోంది. 

ఆటో షేర్లు లాభాల్లో..

Monday 22nd July 2019

 నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో 1.12 శాతం లాభపడి 7,273.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  హీరో మోటర్‌ కార్ప్‌ 2.55 శాతం, మారుతి 2.36 శాతం, టాటా మోటర్స్‌ 1.91 శాతం, అశోక్‌ లేలాండ్‌ 1.39 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 1.23 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 1.20 శాతం, బజాజ్‌ ఆటో 0.91 శాతం, ఎం అండ్‌ ఎం 0.74 శాతం,  భారత్‌ ఫోర్జ్‌ మాత్రం 0.73

Most from this category