News


బ్యాంక్‌ నిఫ్టీ డౌన్‌

Wednesday 22nd January 2020
Markets_main1579670647.png-31093

0.5 శాతం వెనకడుగు
రెండు రోజుల వరస నష్టాలకు చెక్‌ పెడుతూ ప్రారంభంలోనే బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి తిరిగి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. లాభాలను పోగొట్టుకోవడంతోపాటు.. నష్టాల బాట పట్టాయి. ఉదయం 10.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 60 పాయింట్లు క్షీణించి 41,254ను తాకగా.. నిఫ్టీ 24 పాయింట్లు తక్కువగా 12,146 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాం‍క్‌ కౌంటర్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ 0.6 శాతం క్షీణించింది. పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ బ్యాంకులతో కూర్చిన బ్యాంక్‌ నిఫ్టీ తొలుత 31.062 వద్ద ప్రారంభమైంది. తదుపరి 31,149 వద్ద గరిష్టాన్ని తాకగా.. 30,780 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ప్రస్తుతం 30,767 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంక్‌ షేర్ల తీరిదీ
ప్రస్తుతం బ్యాంక్‌ నిఫ్టీలో భాగమైన కొటక్‌ మహీంద్రా, యాక్సిస్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ఇండ్‌, బీవోబీ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ 1.6-0.4 శాతం మధ్య నష్టపోయి కదులుతున్నాయి.



You may be interested

సింగపూర్‌ కొత్త ఒప్పందం- ఎఫ్‌పీఐలకు ప్రతికూలం?!

Wednesday 22nd January 2020

భారత్‌లో పెట్టుబడులు పెట్టే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఎక్కువగా సింగపూర్‌ మార్గంలో వస్తుంటారు. అయితే తాజాగా ఇండియా, సింగపూర్‌ మధ్య కుదిరిన ఎంఎల్‌ఐ(మల్టీలేటరల్‌ అగ్రిమెంట్‌)తో ఇండియాకు వచ్చే ఎఫ్‌పీఐలపై నెగిటివ్‌ ప్రభావం పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఇండియాలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఫండ్‌ మేనేజర్లు కేవలం ఇండియాలో పెట్టుబడుల కోసమే సింగపూర్‌లో పాగా వేయలేదని ఇండియా పన్ను

నేడు వార్తల్లో షేర్లు

Wednesday 22nd January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌:   జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్యూ3 నికర లాభం 37.9 శాతం తగ్గి రూ.349.4 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 5.5 శాతం తగ్గి రూ.2,048.7 కోట్లుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ: హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ క్యూ3 నికర లాభం 45 శాతం పెరిగి రూ.352.55 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన నికర ఆదాయం 10 శాతం పెరిగి రూ.524.73 కోట్లకు చేరింది. హవెల్స్‌:

Most from this category