News


బ్యాంక్‌ నిఫ్టీ 473 పాయింట్లు పతనం

Friday 14th February 2020
Markets_main1581664369.png-31792

ఏజీఆర్ చెల్లింపుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికాం కంపెనీలకు ఎక్స్‌పోజర్స్‌గా ఉన్న బ్యాంకింగ్‌ రంగ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్రనష్టాన్ని చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు ఉదయం 31,281.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు సంబంధించి న్యూ షెడ్యూల్‌ను జారీ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ టెలికం కంపెనీలు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణగా పరిగణిస్తున్నట్లు సుప్రీం కోర్టు  పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువడిన వెంటనే  టెలికాం కంపెనీలకు ఎక్స్‌పోజర్స్‌గా ఉన్న బ్యాంకింగ్‌ రంగ షేర్లను తీర్పు ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(31,346) వద్ద 2.10శాతం(473 పాయింట్లు) నషాన్ని చవిచూసింది. అనంతరం షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకోవడంతో తిరిగి రికవరీ అయ్యింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు(31,230.25)తో పోలిస్తే 31వేల దిగువను 276.15 పాయింట్ల(0.81శాతం) నష్టంతో 30,954.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి ఇండెక్స్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 2.50శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 2శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నష్టపోయాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో యస్‌ బ్యాంక్‌ షేర్లు 5.25శాతం లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు​అరశాతం లాభపడింది. 



You may be interested

వొడాఐడియా... ఏ బ్యాంకుకు ఎంత బకాయి?

Friday 14th February 2020

బ్యాంకులకు, ప్రభుత్వానికి భారీ నష్టం శుక్రవారం టెల్కోలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌ బకాయిల గడువు పొడిగింపు కోరుతూ కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్స్‌ను తోసిపుచ్చింది. ఇంతవరకు ఏజీఆర్‌ బకాయిలు ఎందుకు వసూలు చేయలేదని డీఓటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టెలికం కంపెనీలు ముందు ఆదేశించిన విధంగా తప్పక ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏజీఆర్‌ బాకీలపై పునర్విచారణ, చెల్లింపుల సరళీకరణ జరగకపోతే కంపెనీ మూసుకుపోవడం తప్ప వేరే

సుప్రీం కొరడా...అయినా ఎయిర్‌టెల్‌ కొత్త హై! ఎందుకు?

Friday 14th February 2020

ఏజీఆర్‌ కేసు నేపథ్యంలో షేరు హైజంప్‌   కుప్పకూలిన వొడాఫోన్‌ ఐడియా షేరు ఎయిర్‌టెల్‌ షేరు 3 నెలల్లో 45 శాతం ర్యాలీ  ఇటీవల జోరు చూపుతున్న మొబైల్‌ రంగ దేశీ దిగ్గజం భారత్‌ ఎయిర్‌టెల్‌ షేరు మరోసారి దూకుడు చూపుతోంది. ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో ఉదయం 11.30 ప్రాంతంలో 5 శాతం జంప్‌చేయడం ద్వారా రూ. 564ను అధిగమించింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా..  ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 4 శాతం

Most from this category