News


బ్యాంక్‌ నిఫ్టీ 700 పాయింట్లు డౌన్‌!

Thursday 10th October 2019
Markets_main1570688412.png-28799

యుఎస్‌-చైనా మధ్య ప్రాథమిక వాణిజ్య చర్చలలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నెగిటివ్‌గా కదులుతున్నాయి. గత సెషన్‌లో 1000 పాయింట్లకు పైగా లాభపడిన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయి ట్రేడవుతోంది. ఉదయం 11.41 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.45 శాతం లేదా 703.85 పాయింట్లు నష్టపోయి 28,082.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.41 శాతం నష్టపోయి రూ. 1,198.60  వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.85 శాతం నష్టపోయి రూ. 424.25 వద్ద ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో యెస్‌ బ్యాంక్‌ 4.16 శాతం, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 4.07 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.46 శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 2.99 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 2.84 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.53 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.44 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 2.21 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 2.16 శాతం,  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.71 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.



You may be interested

మూడు నెలల కాలానికి ఐదు సిఫార్సులు

Thursday 10th October 2019

వచ్చే మూడు నెలల కాలంలో 10 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. వోల్టాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 775. స్టాప్‌లాస్‌ రూ. 650. రెండేళ్ల క్రితం ఆల్‌టైమ్‌ హైని తాకింది. అనంతరం కరెక‌్షన్‌ జోన్‌లో ప్రవేశించి రూ. 519 వరకు దిగజారింది. అప్పటి నుంచి రెండు స్థాయిల మధ్య కన్సాలిడేషన్‌ జరుపుతూ వస్తోంది. దీంతో వీక్లీ చార్టుల్లో రౌండింగ్‌ బాటమ్‌ ప్యాట్రన్‌ ఏర్పరిచింది. గత

నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం బెటర్‌!

Thursday 10th October 2019

నిపుణుల సూచన ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం అవలంబించవచ్చని ఎఫ్‌అండ్‌ఓ నిపుణులు సూచిస్తున్నారు. నెలాఖరు వరకు సూచీ 10800- 11600 పాయింట్ల మధ్యనే కదలాడుతుందన్న అంచనాలతో ఎక్కువమంది నిపుణులు ఉన్నారు. ఇలాంటప్పుడు 11200 స్ట్రైక్‌ప్రైస్‌ వద్ద కాల్‌ మరియు పుట్‌ను రైట్‌ చేయడం(విక్రయించడం) ద్వారా షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం పాటించవచ్చని చెబుతున్నారు.  - ఈ వ్యూహంలో 11200 కాల్‌ మరియు పుట్‌ రెండిటి లాట్స్‌ను సుమారు 400 రూపాయల(బుధవారం ధరల

Most from this category