News


32,000 దిగువన బ్యాంక్‌ నిఫ్టీ ముగింపు

Thursday 26th December 2019
news_main1577355418.png-30457

డిసెంబ‌ర్ డెరివేటివ్ కాంట్రాక్టు గ‌డువు ముగింపు నేప‌థ్యంలో గురువారం బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భారీగా అమ్మకాలు నెలకొన్నాయి. ఫలితంగా నేడు మార్కెట్‌ ముగిసే సరికి 32వేల స్థాయిని కోల్పోయి 31,997.70 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 32,276.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు డిసెంబ‌ర్ డెరివేటివ్ కాంట్రాక్టు గ‌డువు ముగింపు నేప‌థ్యంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా మార్కెట్‌ చివరి గంటలో అమ్మకాల ఉధృతి పెరిగింది. ఒక దశలో ఇండెక్స్‌ 285 పాయింట్లు(1.85శాతం) నష్టపోయి 31,995.55 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసి దాదాపు అదే స్థాయి 31,997.70 వద్ద స్థిరపడింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1.50శాతం నష్టపోవడం ఇండెక్స్‌ భారీ పతనానికి కారణమైనంది. బ్రిక్స్‌వర్క్‌ రేటింగ్‌ సంస్థతో పాటు సిటిగ్రూప్‌ సంస్థ బాండ్ల రేటింగ్‌ను తగ్గించడంతో యస్‌బ్యాంక్‌ షేర్లు 4శాతం నష్టపోయాయి. పీఎన్బీ షేరు 1.25శాతం, కోటక్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 0.10శాతం క్షీణించాయి. అయితే... ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ మాత్రం 1శాతం లాభంతో క్లోజయ్యింది. 



You may be interested

ఎఫ్‌అండ్‌వో ఎఫెక్ట్‌- మూడో రోజూ డౌన్‌

Thursday 26th December 2019

ఎఫ్‌అండ్‌వో చివరి రోజూ మార్కెట్లు డీలా డిసెంబర్‌ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ ఎఫెక్ట్‌ నష్టాలకు ఎదురీదిన మెటల్‌ ఇండెక్స్‌ వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగు వేశాయి. తొలి నుంచీ బలహీనంగా కదిలిన మార్కెట్లు సమయం​ గడిచేకొద్దీ మరింత నీరసించాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 297 పాయింట్లు పతనమై 41,164 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 88 పాయింట్లు క్షీణించి 12,127 వద్ద స్థిరపడింది. డిసెంబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ గడువు గురువారంతో ముగియనున్న

2019: ఈ స్టాక్స్‌.. హీరోలు

Thursday 26th December 2019

కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం నెలకొనడం, ప్రభుత్వ సంస్కరణలు, రిజర్వ్‌ బ్యాంక్‌ రేట్ల కోతలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు తదితర సానుకూల అంశాల నేపథ్యంలో ఈ ఏడాది ఇప్పటివరకూ దేశీ స్టాక్‌ మార్కెట్లు సగటున 10 శాతంపైగా లాభాలు ఆర్జించాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 13 శాతంపైగా ర్యాలీ చేయగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 శాతం పురోగమించింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో కొన్ని నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు

Most from this category