ప్రైవేట్ బ్యాంకు షేర్ల ర్యాలీ: లాభాల్లో నిఫ్టీ బ్యాంకు
By Sakshi

మార్కెట్ ర్యాలీ భాగంగా ఎన్ఎస్ఈలోని కీలకమైన బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ లాభాల బాటపట్టింది. బ్యాంకింగ్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించిస్తున్న ఈ ఇండెక్స్ నేడు 31,192.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభం నుంచి ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ షేర్లు లాభపడటంతో బ్యాంక్ నిఫ్టీ 236 పాయింట్లు (0.75శాతం) లాభపడి 31,398.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు తమ జీవితకాల గరిష్టాలను తాకడం ఇండెక్స్ ర్యాలీకి కలిసొచ్చింది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్ గతముగింపు(31,162.35)తో పోలిస్తే 0.75పాయింట్లతో పోలిస్తే 31,385.85 వద్ద ట్రేడ్ అవుతోంది. యాక్సిక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు 1.50శాతం లాభపడ్డాయి. ఫెడరల్ బ్యాంకు 1శాతం పెరిగింది. అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే బ్యాంకు ఆఫ్ బరోడా, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకు షేర్లు అరశాతానికి పైగా ర్యాలీ చేశాయి., ఆర్బీఎల్ షేర్లు 0.10శాతం పెరిగింది. మరోవైపు యస్‌బ్యాంక్ షేర్లు అరశాతం నష్టపోగా, పీఎస్బీ బ్యాంకు 0.10శాతం నష్టపోయింది.
ఇక ఇదే సమయానికి నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 11,894.60 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు ర్యాలీ చేసి 39,762.91 వద్ద ట్రేడ్ అవుతోంది.
You may be interested
రికార్డు గరిష్టానికి ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
Thursday 27th June 2019ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజ కంపెనీలైన ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు గురువారం తమ కొత్త జీవితకాల గరిష్టాలను అందుకున్నాయి. నేడు మార్కెట్లో బ్యాంకింగ్ రంగ షేర్లకు లభిస్తున్న మద్దతులో భాగంగా ఈ రెండు షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు:- నేడు ఎన్ఎస్ఈలో రూ.2,468.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ను ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోలుకు ఇన్వెస్టర్లకు మొగ్గుచూపడంతో 0.81శాతం లాభపడి రూ.2488.00ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని
తగ్గుముఖం పట్టిన పసిడి
Thursday 27th June 2019చైనాతో వాణిజ్య యుద్ధ చర్చలపై అమెరికా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో గురువారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి ధర 7డాలర్లు నష్టపోయి 1,408 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే జీ-20 సదస్సులో చైనా- అమెరికా దేశాధ్యక్షులు వాణిజ్య యుద్ధంపై చర్చించనున్నారు. ఈ కీలక పరిణామాణ నేపథ్యంలో నిన్న యూఎస్ ట్రెజరీ అధికారి స్టీవెన్ మాట్లాడుతూ ఇరుదేశాలకు ఆమోదయోగ్యంగా