News


26800 దిగువకు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Thursday 19th September 2019
Markets_main1568876722.png-28433

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 26800 స్థాయిని కోల్పోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ నేడు 27,175.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి బ్యాంకింగ్‌ షేర్లు అమ్మకాల బాట పట్టాయి. ప్రైవేట్‌ రంగ షేర్ల క్షీణత ఇండెక్స్‌ను భారీ నష్టాలపాలు చేసింది. ఫలితంగా ఇండెక్స్‌ 400 పాయింట్లు నష్టపోయి 26,767.90 ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:10ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు (27172.65)తో పోలిస్తే 1.25శాతం లాభంతో 26,829.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  ఇదే సమయానికి యస్‌బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా 8శాతం నష్టపోయాయి. ఆర్‌బీఎల్‌ 4శాతం, ఐసీసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.50శాతం, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 1.50శాతం నష్టపోయింది. యస్‌బీఐ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 1శాతం క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

సెయిల్‌, ఎన్‌ఎండీసీ, టాటా స్టీల్‌ 4% పతనం!

Thursday 19th September 2019

చమురు ధరలు భారీగా పెరగడంతో మొదలైన మార్కెట్‌ నష్టాలు గురువారం కూడా కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఐఐ(విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు)లు బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. మధ్యాహ్నాం 12.46 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.91 శాతం నష్టపోయి 2,356.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సెయిల్‌ 4.34 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 4.03 శాతం,  టాటా స్టీల్‌ 3.94 శాతం నష్టపోయి ఇండెక్స్‌

లిక్విడీటీ సంక్షోభం ముగుస్తుంది!

Thursday 19th September 2019

-ఎడల్వీస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రాషేస్‌ షా   ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌) అల్టికో క్యాపిటల్‌ ఇండియా కంపెనీ, గత వారం డీఫాల్ట్‌ను ఎదుర్కొంది. ఫలితంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ కొరత ఆందోళనలు తిరిగి పెరిగాయి. అయినప్పటికి దేశంలో లిక్విడిటీ సంక్షోభం ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ముగుస్తుందని ఎడల్వీస్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రాషేస్‌ షా అభిప్రాయపడ్డారు. ‘ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, ప్రభుత్వానికి తన అదనపు నిధులను

Most from this category