News


బ్యాంక్‌ నిఫ్టీ క్రాష్‌

Tuesday 3rd September 2019
Markets_main1567484339.png-28156

మార్కెట్‌ భారీపతనంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 27000 స్థాయికి కోల్పోయింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 27,239.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితులకు తోడు, 10 పీఎస్‌యూ బ్యాంకులను విలీనం చేయడం ద్వారా 4 పెద్ద బ్యాంకుల ఆవిర్భావానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపడంతో బ్యాంకింగ్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇండెక్స్‌లో అధిక పరిమాణం కలిగిన పీఎన్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, 5శాతం నుంచి 2.50శాతం వరకు నష్టపోవడంతో ఇండెక్స్‌ భారీగా పాయింట్లను కోల్పోయింది. ఒకదశలో దాదాపు 500 పాయింట్లను కోల్పోయి 27,239.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,427.85)తో పోలిస్తే 1.69శాతం(470 పాయింట్లు) క్షీణించి 26,958.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి పీఎన్‌బీ 5శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 3శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.50శాతం, యస్‌బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యాక్సిస్‌బ్యాంక్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. అలాగే, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం పతనంకాగా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు మాత్రం అరశాతం నష్టపోయింది. 



You may be interested

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ కొత్త రికార్డులు

Tuesday 3rd September 2019

ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో మంగళవారం ట్రేడింగ్‌లో రూపీ డాలర్‌ మారకంలో 72 దిగువకు క్షీణించింది. రూపీ క్షీణించడంతో ఐటీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌లు వాటి జీవితకాల రికార్డుస్థాయల్ని తాకడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం 9.41 సమయానికి 0.66 శాతం లాభపడి 16,115.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టీసీఎస్‌ గత

72 దిగువకు రూపీ

Tuesday 3rd September 2019

డాలర్‌ మారకంలో రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 55 పైసలు బలహీనపడి 71.95 వద్ద ప్రారంభమై..కొద్ది సమయంలోనే 72 దిగువకు జారిపోయింది. దేశియ ఈక్విటీ సూచీలు పాజిటివ్‌గా ట్రేడవ్వడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయనే అంచనాల నేపథ్యంలో గత సెషన్‌లో(శుక్రవారం) రూపీ డాలర్‌ మారకంలో 38 పైసలు బలపడి 71.40 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సెంజ్‌ వద్ద రూపీ డాలర్‌ మారకంలో 71.76

Most from this category