STOCKS

News


32వేల పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Friday 13th December 2019
Markets_main1576224196.png-30210

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు దుమ్ము లేపుతున్నాయి. దీంతో మిడ్‌సెషన్‌ కల్లా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 32వేల స్థాయిని అధిగమించింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 31,775.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు స్వల్పంగా ఉన్నప్పటికి.., క్రమంగా డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువ లభించింది. ఒకదశలో 1.38శాతం పెరిగి 32105 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:00ల ఇండెక్స్‌ క్రితం ముగింపు(32036.75)తో పోలిస్తే 1.15శాతం లాభంలో 32,028.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 5శాతం లాతభఫడింది. యాక్సిస్‌ బ్యాంక్‌ 4శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌ 3శాతం పెరిగాయి. ఆర్‌బీఎల్‌ 2.50శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ 2శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.50శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.25శాతం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ 1శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అరశాతం పెరిగాయి. ఒక్క కోటక్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 1శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ర్యాలీకి రీజన్స్‌ ఇవే!

Friday 13th December 2019

దేశీయ మార్కెట్లు శుక్రవారం మంచి ర్యాలీ జరుపుతున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల మేర అప్‌మూవ్‌ చూపాయి. నిఫ్టీ కీలకమైన 12056 పాయింట్ల పైన స్థిరంగా కదలాడుతోంది. ఈర్యాలీకి నాలుగు ప్రధాన కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1. ట్రేడ్‌ ఉద్రిక్తతలు చల్లారడం: యూఎస్‌, చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ ముగింపునకు వచ్చినట్లు సంకేతాలు వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఒక డీల్‌కు సంబంధించి ట్రంప్‌ గ్రీన్‌సిగ్నల్‌

ట్రేడ్‌ డీల్‌ ఖరారుతో తగ్గిన పసిడి

Friday 13th December 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందానికి ట్రంప్‌ అంగీకరించారనే వార్తలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి. నిన్నరాత్రి అమెరికాలో 1491 డాలర్ల గరిష్టాన్ని అందుకున్న అనంతరం యూఎస్‌- చైనా ట్రేడ్‌ డీల్‌కు ట్రంప్‌ ఆమోదం తెలిపారన్న వార్తలతో అక్కడి నుంచి 1469డాలర్ల కనిష్టానికి పతనమైంది. తిరిగి స్వల్ప రికవరీని సాధించి 1,472.30 డాలర్ల వద్ద స్థిరపడింది. నేడు ఆసియాలో 1డాలరు స్వల​లాభంతో 1,473.80 వద్ద ప్రారంభమైంది.

Most from this category