News


31000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Friday 15th November 2019
Markets_main1573795609.png-29611

మార్కెట్‌ ప్రారంభంలోనే బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31000 స్థాయి పైకి ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,912.40 పాయింట్ల ప్రారంభమైంది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ క్రితం ముగింపు(30749.95)తో పోలిస్తే ఒకశాతానికి పైగా లాభపడి 31010.15 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.9:40ని.లకు ఇండెక్స్‌ 0.79శాతం (243.05 పాయింట్లు) పెరిగి 30,993.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో పీఎన్‌బీ 4.50శాతం, ఎస్‌బీఐ 3శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం పెరిగాయి. కోటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1శాతం ర్యాలీ చేయగా,  ఇం‍డస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఫెడరల బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌ అరశాతం నుంచి 0.10శాతం లాభపడ్డాయి.

ఇక ఇదే సమయానికి ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 208 పాయింట్లు పెరిగి 40,494.42 వద్ద, నిఫ్టీ 53.20 పాయింట్ల లాభంతో 11,925.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రూ. 500 పైకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Friday 15th November 2019

కార్పోరేట్‌ పన్ను రేటును ప్రభుత్వం తగ్గించిన తర్వాత నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం ప్రారంభించాయి. దీనికితోడు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగా ఉండడంతో ఈక్విటీ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ జీవిత కాల గరిష్ఠానికి చేరువలో ఉంది. ఈ ఇండెక్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తు కదులుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు శుక్రవారం

బలపడిన రూపీ

Friday 15th November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో 18 పైసలు బలపడి 71.79 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 72 స్థాయి దిగువకు పడిపోయింది. సెషన్‌ పూర్తయ్యేనాటికి స్వల్పంగా బలపడి 71.97 వద్ద ముగిసింది. వచ్చే నెల జరగనున్న ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) సమావేశంలో చమురు ఉత్పత్తి కోతను కొనసాగించనున్నారనే అంచనాలుండడంతో చమురు ధరలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.

Most from this category