News


31000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Friday 8th November 2019
Markets_main1573200361.png-29449

మార్కెట్‌ ప్రారంభం ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా లాభాల బాట పట్టిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌ సెషన్‌ సమయానికి 31000 స్థాయికి ఎగిసింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,571.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌(3.75శాతం) లాభపడి జీవితకాల గరిష్టాన్ని అందుకోవడం, యస్‌బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 9శాతం నుంచి 4శాతం పెరగడం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి అరశాతం పెరగడంతో ఇండెక్స్‌ 1.50శాతం వరకు లాభపడి 31,104.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(30,633.15)తో పోలిస్తే 1.50శాతం లాభంతో 31,097.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు ఫెడరల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పీఎన్‌బీ షేర్లు 1శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. 



You may be interested

టీసీఎస్‌ నుంచి ఇన్ఫీ వైపు మొగ్గుతున్న ఎంఎఫ్‌లు

Friday 8th November 2019

దిగివచ్చిన వాల్యూషన్లే కారణం బడా ఫండ్‌ మేనేజర్ల ఆసక్తి క్రమంగా టీసీఎస్‌ షేరు నుంచి ఇన్ఫోసిస్‌ షేరు వైపు మరలుతున్నట్లు కనిపిస్తోందని మ్యూచువల్‌ ఫండ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు షేర్లూ ప్రతిఒక్కరూ తమ పోర్టుఫోలియోలో ఉంచుకోవాల్సినవేనని, కాకపోతే ప్రస్తుతం బడా ఇన్వెస్టర్ల మొగ్గు కొంతమేర ఇన్ఫీవైపు ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని తాజా గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. గత ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో ఇన్ఫీ షేరు దాదాపు 11 శాతం

9.50శాతం లాభపడ్డ యస్‌బ్యాంక్‌

Friday 8th November 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేరు శుక్రవారం మిడ్‌సెషన్‌ కల్లా 9.50శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు​రూ.66.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీలో భాగంగా ఈ కంపెనీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒకదశలో 9.54శాతం పెరిగి రూ.72.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12:30లకు షేరు క్రితం ముగింపు(రూ.66.50)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.71.35

Most from this category