News


నష్టాల్లోంచి లాభాల్లోకి బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 4th September 2019
Markets_main1567579841.png-28186

మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం లాభనష్టాల మధ్య కదలాడుతుంది. నేడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌ 26,785.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఫ్లాట్‌గా ప్రారంభంలో భాగంగా మొదటి 183 పాయింట్లు(0.68శాతం) క్షీణించి 26641.35 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అనంతరం కనిష్టస్థాయి వద్ద బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ కనిష్టస్థాయి (26641.35) 482 పాయింట్లు(దాదాపు 2శాతం) పెరిగి 27,123.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ కిత్రం ముగింపు(26,824.15)తో పోలిస్తే 229 పాయింట్ల(0.85శాతం) లాభంతో 27,052.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అ‍త్యధికంగా ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం ర్యాలీ చేశాయి. అలాగే పీఎన్‌బీ, ఫెడరల్‌ బ్యాంక్‌ 1శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ అరశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 1శాతం నష్టపోయాయి. 



You may be interested

సన్‌ఫార్మా 8శాతం క్రాష్‌..!

Wednesday 4th September 2019

దేశీయ రెండో అతిపెద్ద ఫార్మా దిగ్గజ కంపెనీ సన్‌ఫార్మా షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 8.50శాతం క్షీణించాయి. కంపెనీలో జరిగిన అవకతవకలపై సీబీఐ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు సెబీ ఆదేశించినట్లు వార్తలు వెలుగులోకి రావడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.423.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  కార్పొరేట్‌ గవర్నెన్స్‌, సెక్యూరిటీ మార్కెట్ల నిబంధనల ఉల్లంఘన తదితర నిబంధనల ఉల్లంఘనపై విజిల్‌ బ్లోయర్‌ చేసిన 150 పేజీల ఫిర్యాదు ఆధారంగా

రాణిస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌..ఫార్మా ఇండెక్స్‌ డౌన్‌

Wednesday 4th September 2019

దేశ జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని సెషన్‌ల నుంచి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ బుధవారం సెషన్‌లో మధ్యాహ్నాం 12.06 సమయానికి 1.98 శాతం నష్టపోయి 7,818.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన దివిస్‌ ల్యాబ్‌ 1.83 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 1.26 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, డా. రెడ్డీస్‌

Most from this category