News


రెండు వారాల గరిష్టానికి మార్కెట్‌

Tuesday 15th October 2019
Markets_main1571135705.png-28902

  • 291 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌
  • 11400 పైన ముగిసిన నిఫ్టీ
  • కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూల సంకేతాలు 

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్‌ మూడో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 291 పాయింట్ల లాభంతో 38,506.09 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 11,400 స్థాయి పైన 11,428.30 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకు ఈ స్థాయిలు రెండు వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. గతవారంలో జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాతో చైనా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం సరైందేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ ప్రకటనతో పాటు యూరోపియన్ యూనియన్ చీఫ్ బ్రెక్సిట్ సంధానకర్త ఈ వారం బ్రెక్సిట్ నిబంధనలపై బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అటో, మెటల్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. ఇంట్రాడే సెన్సెక్స్‌ 412 పాయింట్ల లాభపడి 38,635.19 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 11,462.35 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 333 పాయింట్లు పెరిగి 28,555.10 వద్ద స్థిరపడింది.ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ఇన్వెస్టర్లు మరోసారి ఆర్బీఐ నుంచి మరోసారి రేటు తగ్గింపును ఆశిస్తున్నారు. కంపెనీలు త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్న తరణంలో రానున్న రోజుల్లో ఆయా కంపెనీల క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు దిశానిర్దేశం కానున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
హీరోమోటోకార్ప్‌, ఓఎన్‌జీసీ, జీ లిమిటెడ్‌, వేదాంత, ఐషర్‌మోటర్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.70శాతం లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటర్స్‌, ఇన్ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 1శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల టాప్‌ సిఫార్సులు!

Tuesday 15th October 2019

హిందుస్తాన్‌ యూనీలీవర్‌పై సీఎల్‌ఎస్‌ఏ హిందుస్తాన్‌ యూనీలీవర్‌(హెచ్‌యూఎల్‌) ఈపీఎస్‌(షేరుపై ఆదాయం) అం‍చనాలను 1-2 శాతం పెంచింది. అంతేకాకుండా టార్గెట్‌ ధరను రూ. 2,135 నుంచి రూ. 2,250 కి పెంచింది. హోం కేర్‌, పర్సనల్‌ కేర్‌ విభాగంలో ఈ కంపెనీ బలమైన మార్జిన్‌లను పొందుతోందని తెలిపింది. ఈ కంపెనీ అమ్మకాల పరిమాణంలో వృద్ధి బాగానే ఉందని, వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల ట్రెండ్‌లుండడం వలన డిమాండ్‌ దృక్పథంలో కొన్ని సమస్యలున్నాయని తెలిపింది. ఈ కంపెనీ,

షార్ట్‌టర్మ్‌కు ఏడు సిఫార్సులు

Tuesday 15th October 2019

వచ్చే మూడు, నాలుగు వారాల్లో 10 శాతం వరకు రాబడినిచ్చే ఏడు స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. రెలిగేర్‌ బ్రోకింగ్‌ అనలిస్టు అజిత్‌ మిశ్రా సిఫార్సులు 1. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 120... 10 శాతం అప్‌సైడ్‌ ఛాన్స్‌. 2. గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 740... ఏడు శాతం అప్‌సైడ్‌ ఛాన్సులు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నందీశ్‌ షా రికమండేషన్లు 1. బ్రిటానియా ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ.

Most from this category