News


బంధన్‌ బ్యాంకుపై బ్రోకరేజీల భిన్న స్పందన

Monday 22nd July 2019
Markets_main1563818748.png-27237

బంధన్‌ బ్యాంకు జూన్‌ త్రైమాసికానికి మంచి ఫలితాలను ప్రకటించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 46 శాతం పెరిగింది. ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడింది. అయితే ఈ స్టాక్‌ విషయంలో బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

 

బ్రోకరేజీ సంస్థ యాంబిట్‌ ఈ స్టాక్‌కు రూ.309 టార్గెట్‌తో తన సెల్‌ రేటింగ్‌ను కొనసాగించింది. ప్రస్తుత ధర రూ.501 నుంచి చూసుకుంటే 40 శాతం తక్కువకు టార్గెట్‌ ఇచ్చినట్టు అయింది. క్వార్టర్‌ వారీగా చూసుకుంటే నికర వడ్డీ మార్జిన్‌ 24 బేసిస్‌ పాయింట్లు తగ్గిందని, కాసా 11 శాతం క్షీణించినట్టు యాంబిట్‌ తెలిపింది. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సైతం రూ.500 టార్గెట్‌కు సెల్‌ రేటింగ్‌ ఇచ్చింది. స్టాక్‌ కూడా ప్రస్తుతం ఈ ధర దగ్గరే ఉండడం గమనార్హం. బ్యాంకు రుణ పుస్తకంలో సింహభాగం సూక్ష్మ రుణాలు ఉండడం అన్నది మంచి వైవిధ్యం కాదని హెచ్చరించింది. బ్యాంకు రుణ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం చూడాల్సి ఉందని పేర్కొంది. అయితే, బ్యాంకు ఇందుకోసం గృహ్‌ ఫైనాన్స్‌ను విలీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2019-22 మధ్య బ్యాంకు ఆస్తులు కాంపాండెడ్‌ ప్రాతిపదికన ఏటా 45 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చని కోటక్‌ అంచనా వేసింది. గృహ్‌ ఫైనాన్స్‌ వీలీనం, సూక్ష్మ రుణాల్లో బలమైన పెరుగుదల అంశాల ప్రాతిపదికన ఈ అంచనాకు వచ్చింది. 

 

ఇక ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ మాత్రం రూ.770 టార్గెట్‌కు బై రేటింగ్‌ ఇచ్చింది. ప్రస్తుత ధర నుంచి చూసుకుంటే 50 శాతం ఎక్కువ. గృహ్‌ ఫైనాన్స్‌ విలీనం విషయంలో ఎన్‌సీఎల్‌టీ తుది ఆమోదం కోసం బంధన్‌ బ్యాంకు వేచి చూస్తున్న విషయం తెలిసిందే. విలీనం తర్వాత కూడా వ్యాపార నిర్వహణ తీరు బంధన్‌ బ్యాంకు మాదిరే ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. గతంలో ఇచ్చిన బై రేటింగ్‌ను కొనసాగిస్తూ, టార్గెట్‌ను మాత్రం గతంలో ఇచ్చిన రూ.779 నుంచి రూ.770కు సవరించింది. ఇక జేఎం ఫైనాన్షియల్‌ సంస్థ సైతం రూ.710 టార్గెట్‌తో కొనుగోలు చేసుకోవాలంటూ సూచించింది. సవాళ్లతో కూడిన భిన్న సమయాల్లోనూ (నోట్ల రద్దు, ప్రకృతి విపత్తలు, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో) బంధన్‌ బ్యాంకు యాజమాన్యం ఆస్తుల నాణ్యతను కొనసాగించడంతో ఈ బ్యాంకు విషయంలో జేఎం సానుకూలంగా ఉంది. క్షేత్ర స్థాయిలో తన సిబ్బందికి బలమైన శిక్షణ ఇవ్వడం, పాత కస్టమర్ల బేస్‌ ఎక్కువగా ఉండడం సానుకూలతలుగా పేర్కొంది. You may be interested

క్రిస్‌మస్‌ నాటికి 10,000కు నిఫ్టీ..!

Monday 22nd July 2019

ఒకవైపు దేశ ఆర్థిక రంగ వృద్ధి ప్రతికూలంగా ఉండడం, మరోవైపు అంతర్జాతీయంగానూ వృద్ధి పరుగులు తీసేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడం... మరోవైపు పన్నుల భారంతో ఎఫ్‌పీఐల అమ్మకాలు, కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం వెరసి మన ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిలో చిక్కుకున్నాయి. నిఫ్టీ కీలక మద్దతు స్థాయి అయిన 11,300కు సమీపానికి వచ్చేసింది. ఇది కీలకమైన మద్దతు ‍స్థాయి అని, రానున్న రోజుల్లో మార్కెట్లు ఇంకా దిద్దుబాటుకు

సూచీలకు హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షాక్‌

Monday 22nd July 2019

3వరోజూ ఆగని పతనం 11350 దిగువకు నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌  హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ ద్వయం భారీ పతనంతో మార్కెట్‌ మూడో రోజూ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 306 పాయింట్లు నష్టంతో 38,031 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లను కోల్పోయి 11, 346.20 వద్ద స్థిరపడ్డాయి. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన  పరిస్థితులు, దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. అలాగే  క్రూడాయిల్‌ ధరల

Most from this category