News


బలరామ్‌పూర్‌ చినీ.. మరింత పెరుగుతుందా?

Thursday 2nd January 2020
Markets_main1577942271.png-30611

2013 తదుపరి సరికొత్త గరిష్టానికి షేరు

ఇటీవల కొద్ది రోజులుగా దూకుడు చూపుతున్న షుగర్‌ రంగ కౌంటర్‌ బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌ మరోసారి వెలుగులో నిలిచింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో గురువారం ఎన్‌ఎస్‌ఈలో తొలుత రూ. 2 పెరిగి రూ. 189 సమీపానికి చేరింది. ఇది 2013 మే తదుపరి గరిష్టంకావడం విశేషం! కాగా.. 10.32 ప్రాంతంలో క్రితం ముగింపు రూ. 187 సమీపంలో ట్రేడవుతోంది. బుధవారం సైతం ఈ షేరు 2 శాతం బలపడి రూ. 188ను తాకిన సంగతి తెలిసిందే. ప్రధానంగా చెరకు దిగుబడి తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో చక్కెర ఉత్పత్తి తగ్గినట్లు వెలువడిన వార్తలు కొద్ది రోజులుగా షుగర్‌ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఇకపై మరింత జోరు
బలరామ్‌పూర్‌ చినీ మిల్స్‌ షేరు ఇటీవల 13 ఏళ్ల గరిష్టాన్ని అధిగమించడంతో సాంకేతిక నిపుణులు స్వల్ప కాలంలో ఈ కౌంటర్‌ మరింత బలపడనున్నట్లు అంచనా వేశారు. అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో ఈ షేరు రూ. 60 నుంచి రూ. 170ను అధిగమించడంలో రూ. 110 వరకూ దిద్దుబాటు(కరెక్షన్‌)ను సైతం చవిచూసినట్లు తెలియజేశారు. తదుపరి ఇటీవల సాధించిన రికవరీ నేపథ్యంలో వీక్లీ చార్టుల ప్రకారం బుల్లిష్‌ హెడ్‌ షోల్డర్స్‌ ప్యాటర్న్‌ కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఈ ప్యాటర్న్‌ నుంచి ఎగువముఖంగా బ్రేకవుట్‌ సాధించి రూ. 188 వద్ద 13ఏళ్ల గరిష్టాన్ని తాకింది. నెలవారీ చార్టుల ప్రకారం కూడా మల్టీఇయర్‌ బేస్‌ ఏర్పడటంతో రూ. 200 స్థాయిని అధిగమించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు విశ్లేషించారు. డైలీ, వీక్లీ చార్టులలో బుల్లిష్‌ మోడ్‌ను ప్రదర్శిస్తున్న బలరామ్‌పూర్‌ షేరు రానున్న 1-3 నెలల్లో రూ. 225 వరకూ పుంజుకునే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో రూ. 176 స్టాప్‌లాస్‌తో రూ. 188-183 స్థాయిలలో ఈ షేరుని స్వల్ప కాలానికి కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. 



You may be interested

క్రమంగా జీఎస్‌టీ రేట్ల పెంపు?!

Thursday 2nd January 2020

వస్తు సేవల పన్ను రేట్లను క్రమంగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకేసారి పన్ను రేట్లను పెంచితే కన్జూమర్లపై పెను భారం పడుతుందన్న ఆలోచనతో వీటిని క్రమంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. క్రమానుగత పెంపులో భాగంగా రేట్లను స్వల్పంగా పెంచడం, కొన్ని ఉత్పత్తులను అధిక శ్లాబులోకి దశలవారీగా మార్చడంలాంటి చర్యలను ప్రభుత్వం చేపట‍్టనుంది. ప్రస్తుత పన్ను నిర్మితిని పరిశీలించి, ఆదాయం పెంచుకునే సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం కేంద్ర, రాష్ట్రాల అధికారులతో

టీవీ చానెల్స్‌ ఇకపై మరింత చౌక!

Thursday 2nd January 2020

నిబంధనలు సవరించిన ట్రాయ్‌ కస్టమర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా ట్రాయ్‌ కేబుల్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ నిబంధనలకు కొత్త సవరణలు చేసింది. దీంతో ఇకపై కస్టమర్లు మరింత తక్కువ చందాకు మరిన్ని ఎక్కువ ఛానెళ్లు వీక్షించడం కుదురుతుంది. తాజా సవరణలో భాగంగా అన్ని ఫ్రీ చానెళ్లకు వసూలు చేసే ఫీజును ట్రాయ్‌ రూ. 140కి పరిమితం చేసింది. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలుంటే వాటికి నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు(ఎన్‌సీఎఫ్‌)లో 40 శాతం

Most from this category