News


ఆటో రంగంలో బజాజ్‌,టీవీఎస్‌, మారుతి షేర్లే బెటర్‌!

Friday 18th October 2019
Markets_main1571394093.png-28985

‘ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యనైనా తీసుకుంటుందనే ఆలోచన మార్కెట్‌ వర్గాలలో పెరుగుతోంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికి మార్కెట్‌ సెంటిమెంట్‌ మాత్రం బలపడుతుందనే విషయాన్ని గమనించాలి’ అని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీఈఓ, నిశ్చల్ మహేశ్వరి ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...
పీఎస్‌యూ బ్యాంక్‌లకు దూరం..
ఎస్‌బీఐ, బ్యాంక్‌ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌యూ బ్యాంక్‌లు)ను మినహాయిస్తే, చాలా వరకు పీఎస్‌యూ బ్యాంకులకు దూరంగా ఉండడం మంచిది. బ్యాంకింగ్‌ సెక్టార్‌లో కార్పోరేట్‌ బ్యాంకులు, రిటైల్‌ బ్యాంకులపై ప్రాధాన్యతను కలిగివున్నాం. కార్పోరేట్‌ బ్యాంక్‌లలో ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లను పరిశీలిస్తున్నాం. వీటితోపాటు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌పై కూడా ప్రాధాన్యతను కలిగివున్నాం. ఈ బ్యాంక్‌ స్టాకు దిద్దుబాటుకు గురవ్వడంతోపాటు, బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలు కూడా బాగుండడంతో ప్రస్తుతం ఈ బ్యాంక్‌ మంచి స్థాయిలో ఉంది.
ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్‌, బజాజ్‌ ఆటో.. 
టీవీఎస్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. కంపెనీ మార్జిన్‌లు కూడా పెరిగాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాల పరిమాణం తగ్గినప్పటికి, కంపెనీ కాన్ఫెరెన్స్‌లో అమ్మకాలు తిరిగి పుంజుకుంటాయని మేనేజ్‌మెంట్‌ హామి ఇచ్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ బలంగా ఉన్న రాష్ట్రాలలో వరదలు రావడంతో అమ్మకాలు తగ్గాయని, రానున్న దిపావళికి టీవీఎస్‌ అమ్మకాలు పెరుగుతాయని  కంపెనీ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మొత్తంగా ద్విచక్ర వాహన విభాగంలో  ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించవచ్చు. ఈ విభాగానికి సంబంధించి బజాజ్‌ ఆటో మా టాప్‌ ఎన్నిక.
బజాజ్‌ ఎందుకంటే..
ఆర్థిక సంవత్సరం 2020లో ఆటో కంపెనీలు వృద్ధి రెండెంకెల మేర తగ్గుముఖం పడుతుందని, ఆర్థిక సంవత్సరం 2021లో ఈ కంపెనీల వృద్ధి ప్లాట్‌గా 5 శాతం ఉంటుందని వాహన కంపెనీలు అంచనావేస్తున్నాయి. చాలా వరకు విశ్లేషకులు, అమ్మకాల పరంగానైనా దీనిని అంగీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో బజాజ్‌ ఆటో మంచి స్థాయిలో ఉంది. ఈ కంపెనీ ఆర్థిక సంఖ్యలలో 40 శాతం వాటా ఎగుమతుల వలనే ఉంటుంది. ఆర్థిక సంవత్సరం 2021లో ఈ కంపెనీ 5 శాతం ప్లస్‌ వృద్ధిని నమోదు చేస్తుందని అంచనావేస్తున్నాం. రుతు పవనాలు బాగుండడంతో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనావేస్తున్నాం. అందువలన ద్విచక్ర వాహన విభాగం పుంజుకుంటుందని ఆశిస్తున్నా. పడిపోయినప్పుడు మారుతి షేర్లను కొనుగోలు చేయడం కూడా మంచిది. కానీ ప్రస్తుత పరిస్థితులలో సీవీ(వాణిజ్య వాహనాలు)లకు దూరంగా ఉండాలి. 
బ్యాంక్‌లను ఈ విధంగా విడదీస్తా..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ వంటి రెండు లేదా మూడు బ్యాంక్‌ల షేర్లను మాత్రమే, ఏ స్థాయి వద్దయిన కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. లార్జ్‌ క్యాప్‌లలో హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌లు ముందుండగా, కార్పొరేట్‌ బ్యాంక్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ టాప్‌లో ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ రెండు విభాగాలకు మధ్యలో ఉంటుంది. మూడో విభాగమైన రిటైల్‌ బ్యాంకులలో ఆర్‌బీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు ముందున్నాయి. ఎన్‌పీఏలు అధికంగా ఉన్న యస్‌ బ్యాంక్‌,  ఎస్‌బీఐ వంటి పీఎస్‌యూ బ్యాంక్‌లు కార్పోరేట్‌ బ్యాంక్‌లలో రెండో తరగతికి చెందుతాయి.You may be interested

ఈ మూడు రంగాల్లో నెగిటివ్‌ సర్‌ప్రైజ్‌!

Friday 18th October 2019

క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ సెప్టెంబర్‌ త్రైమాసికంలో కార్పొరేట్‌ బ్యాంకులు, మెటల్స్‌, ఆటో రంగాల కంపెనీలు కోలుకుంటాయని ఎక్కువమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ మూడు రంగాల్లో నెగిటివ్‌ సర్‌ప్రైజ్‌ ఉండొచ్చని క్వాంటమ్‌ సెక్యూరిటీస్‌ డైరెక్టర్‌ నీరజ్‌ దివాన్‌ అభిప్రాయపడుతున్నారు. వీటిలో ఇంకా నెగిటివ్‌ వార్తలు రావాల్సిఉందన్నారు. అందువల్ల ఈ త్రైమాసికంలో ఫలితాలు అంతబాగా ఉండకపోవచ్చని తెలిపారు. అయితే పీఎస్‌యూ బ్యాంకులు గతంలో చవిచూసినంతటి డ్యామేజీ ఉండకపోవచ్చన్నారు. ఇప్పటికే ఈ నెగటివ్‌ వార్తల

డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికతో పీఎస్‌యూ షేర్లకు డిమాండ్‌

Friday 18th October 2019

కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక ఆచరణకు రంగం సిద్ధం చేసిందనే వార్తలు వెలుగులోకి రావడంతో శుక్రవారం పలు ప్రభుత్వరంగ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే  బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ మధ్యాహ్నం 3:00ల సమయానికి 2.50శాతం లాభంతో 6,857.84 వద్ద ట్రేడ్‌ అవుతోంది. పలు పీఎస్‌యూ షేర్లు అధిక పరిమాణంతో ట్రేడవుతూ దాదాపు ర్యాలీ చేశాయి. భెల్‌, హిందుస్థాన్‌ కాపర్‌, ఎంఎంటీసీ, న్యూ ఎస్యూరెన్స్‌ షేర్లు 11శాతానికి

Most from this category