News


బజాజ్‌ షేర్లు బంగారమే!

Thursday 31st October 2019
Markets_main1572515242.png-29262

అదానీ, అంబానీ, టాటా, బిర్లా గ్రూప్‌ స్టాక్స్‌ కన్నా స్పీడ్‌ రాబడులు
గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైని అందుకుంది. ఈ సందర్భంగా 2019 తొలి పదినెలల్లో ఇన్వెస్టర్ల సంపదను పెంచిన షేర్లు, సంపద ధ్వంసం చేసిన షేర్లు పరిశీలిస్తే మొదటి కేటగిరీలో బజాజ్‌గ్రూప్‌ షేర్లు, రెండో గ్రూప్‌లో అడాగ్‌ షేర్లు నిలిచాయి. 2019 అక్టోబర్‌ వరకు చూస్తే బజాజ్‌ గ్రూప్‌ షేర్లు అత్యంత వేగవంతమైన రాబడినిచ్చిన షేర్లుగా నిలిచాయి. అత్యంత స్పీడుగా లాభాలనివ్వడంలో బజాజ్‌ గ్రూప్‌ స్టాకులు అదానీ, అంబానీ, టాటా గ్రూప్‌లను తోసిరాజన్నాయి. బజాజ్‌గ్రూప్‌ స్టాకులన్నీ కలిపి సరాసరిన ఈ ఏడాది తొలి పదినెలల్లో 33.4 శాతం మేర సంపదను పెంచాయి. 
భళా బజాజ్‌...
మొత్తం బజాజ్‌ గ్రూప్‌ స్టాకుల్లో ఐదు స్టాకులు ఏడాది తొలి పదినెలల్లో దాదాపు 17-53 శాతం రాబడులిచ్చాయి. లాభాలను తెచ్చిన వాటిలో బజాజ్‌ ఫైనన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. పదినెలల్లో షేరు 54 శాతం లాభపడింది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర స్కూటర్స్‌(46 శాతం), బజాజ్‌ ఫిన్‌సర్వ్‌(26 శాతం), బజాజ్‌ హోల్డింగ్స్‌(25 శాతం), బజాజ్‌ఆటో(17 శాతం) ఉన్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లలో కేవలం కొన్ని ఆటో స్టాక్స్‌ మాత్రమే పాజిటివ్‌గా కొనసాగాయి. వీటిలో బజాజ​ఆటో ఒకటి కావడం విశేషం. కొన్ని త్రైమాసికాలుగా బజాజ్‌ ఫైనాన్స్‌, ఫిన్‌సర్వ్‌ రెండూ మంచి ఫలితాలు నమోదు చేస్తూ వస్తున్నాయి. దీంతో పలు బ్రోకరేజ్‌లు ఈ షేర్లపై పాజిటివ్‌గా ఉన్నాయి. మరోపక్క ఈ ఏడాది గ్రూప్‌నకు చెందిన ఆరు స్టాకులు మాత్రం 14- 52 శాత మేర నష్టాలు చూశాయి. వీటిలో ముకుంద్‌ ఇంజనీర్స్‌, ముకుంద్‌, బజాజ్‌ సీసీ, బజాజ్‌ హిందుస్థాన్‌ సుగర్స్‌, బజాజ్‌ ఎలక్టి‍్రకల్స్‌, హెర్క్యులస్‌ ఉన్నాయి. 
అదానీలు.. టాటాలు.. బిర్లాలు..
అదానీ గ్రూప్‌ స్టాకుల్లో అదానీ పోర్ట్స్‌ మినహా ఇతర అన్ని షేర్లూ ఈ ఏడాది భారీ లాభాలనిచ్చాయి. వీటిలో అదానీ గ్రీన్‌ 113 శాతం రాబడితో టాప్‌లో ఉంది. తర్వాత స్థానాల్లో అదానీ గ్యాస్‌(47 శాతం), అదానీ ట్రాన్స్‌మిషన్‌(33 శాతం), అదానీ పవర్‌(30 శాతం)ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌ మాత్రం కేవలం ఒక్క శాతం లాభం నమోదు చేసింది. ఇక టాటా గ్రూప్‌ షేర్లలో టీసీఎస్‌, టైటాన్‌, ట్రెంట్‌, వోల్టాస్‌, టీజీబీఎల్‌ షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలనిచ్చాయి. మొత్తం 27 టాటా స్టాకుల్లో 17 మాత్రమే లాభాల్లో నిలిచాయి. వీటిలో టీసీఎస్‌ అత్యధికంగా లాభపడింది. బిర్లాల విషయానికి వస్తే ఆదిత్యబిర్లా గ్రూప్‌నకు చెందిన 9 స్టాకుల్లో ఆరు షేర్లు దాదాపు 33 వేల కోట్ల రూపాయల సంపద క్షీణత చూశాయి. వీటిలో వొడాఫోన్‌ ఐడియా అగ్రగామి. ఇదిఒక్కటే దాదాపు 22వేల కోట్ల రూపాయల సంపద క్షీణత చూసింది. తర్వాత స్థానాల్లో హిండాల్కో, గ్రాసిమ్‌, అదిత్యబిర్లామనీ ఉన్నాయి. ఇక లాభపడ్డవాటిలో ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు ఏడాది తొలిపదినెలల్లో దాదాపు 9వేల కోట్ల రూపాయల మార్కెట్‌క్యాప్‌ పెరుగుదల నమోదు చేసింది. 
అంబానీ..
ఈ ఏడాది అంబానీ సోదరుల్లో ముకేశ్‌ గ్రూప్‌ షేర్లు మంచి లాభాలను ఆర్జించగా, అనీల్‌ గ్రూప్‌ షేర్లు నేలచూపులు చూశాయి. రిలయన్స్‌ఇండస్ట్రీస్‌ షేరు ఈ ఏడాది దాదాపు 31 శాతం లాభపడింది. వచ్చే నాలుగేళ్లలో ఆర్‌ఐఎల్‌ 20000 కోట్ల డాలర్ల సంస్థగా రూపొందుతుందని అంచనాలున్నాయి. ఈ క్రమంలో పలు బ్రోకరేజ్‌లు ఆర్ఐఎల్‌పై పాజిటివ్‌గా ఉన్నారు. ముకేశ్‌కు చెందిన ఆర్‌ఐఐఎల్‌ మాత్రం ఈ ఏడాది ఇప్పటివరకు 20 శాతం నష్టపోయింది. ఇక అనీల్‌గ్రూప్‌ స్టాకుల్లో ఆరు స్టాకులు దాదాపు 88-95 శాతం మేర పతనమయ్యాయి.  దీంతో వీటి మార్కెట్‌క్యాప్‌ దాదాపు 40 శాతం పైగా క్షీణించింది. ఆర్‌క్యాపిటల్‌, ఆర్‌కామ్‌, ఆర్‌హోమ్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌ పవర్‌ తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. కేవలం ఆర్‌నామ్‌ కంపెనీ మాత్రం ఏడాది ఇప్పటివరకు 103 శాతం మేర లాభాల్లో ఉంది. 



You may be interested

‘‘జీ’’ 12శాతం అప్‌

Thursday 31st October 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు గురువారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 12.30శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.236.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన మాతృసంస్థ సంస్థ ఎస్సెల్‌ గ్రూప్‌ ప్రమోటర్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌లో 10శాతం వాటా అమ్మకం గురించి తగిన సమాచారం ఇవ్వకపోవడంతో రుణదాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. లావాదేవీ పూర్తయ్యేవరకూ తనఖాలో వున్న  ప్రమోటర్ వాటాను ఎస్క్రో ఖాతాలో ఉంచే ప్రతిపాదనను తొలగించారు. అయినప్పటికీ ఈ షేరు కొనుగోళ్లకు

యస్‌బ్యాంక్‌కు రూ. 8400 కోట్ల ఆఫర్‌...షేరు 35 శాతం జంప్‌

Thursday 31st October 2019

35 శాతం దూసుకుపోయిన షేరు ఒక అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ నుంచి వాటా కొనుగోలుకు సంబంధించి బైండింగ్‌ ఆఫర్‌ పొందామని యస్‌బ్యాంక్‌ ప్రకటించింది. తాజాగా ఈక్విటీ షేర్లను జారీ చేయడం ద్వారా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ నుంచి 120 కోట్ల డాలర్ల(సుమారు రూ.8400 కోట్లు) పెట్టుబడులు పొందేందుకు బైండింగ్‌ ఆఫర్‌ సాధించామని వెల్లడించింది. సదరు గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ పేరును బ్యాంకు బహిర్గతం చేయలేదు. అయితే హాంకాంగ్‌కు చెందిన ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ సంస్థే ఈ ఇన్వెస్టరని,

Most from this category