News


బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 7 శాతం జంప్‌

Friday 26th July 2019
Markets_main1564136664.png-27340

ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందిస్తున్న బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్ల ధరలు శుక్రవారం 7.50శాతం లాభడ్డాయి. క్రితం రోజు వెలువడిన క్యూ1 ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడం ఇందుకు కారణమైంది. 
బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.3,046.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో ఇంట్రాడేలో షేర్లు 9.50శాతం లాభపడి రూ.3278ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. మార్కెట్‌ ముగిసే సరికి షేరు గతముగింపు ధర(రూ.3,046.50)తో పోలిస్తే రూ.7.50శాతం లాభంతో రూ.3,272.00ల వద్ద స్ధిరపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1,912.20, రూ.3,278.00లుగా నమోదయ్యాయయి.

బజాజ్ ఫిన్‌సర్వీసెస్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.6,775.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించడంతో ఇంట్రాడేలో షేర్లు 7.50శాతం లాభపడి రూ.7298.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. మార్కెట్‌ ముగిసే సరికి షేరు గతముగింపు ధర(రూ.6,782)తో పోలిస్తే రూ.7.30శాతం లాభంతో రూ.7,279.70 ల వద్ద స్ధిరపడింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.4,955.00లు, రూ.8,580.00లుగా నమోదయ్యాయి.



You may be interested

ఆరురోజుల నష్టాలకు బ్రేక్‌

Friday 26th July 2019

కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ రాణించిన అటో, బ్యాంకింగ్‌ షేర్లు సూచీల ఆరురోజుల సుధీర్ఘ నష్టాల ముగింపునకు శుక్రవారం బ్రేక్‌ పడింది. నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 11,250ల పైన 11,284.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 52 పాయింట్లు లాభపడి 37,883 వద్ద స్థిరపడింది. నేటి నుంచి ఆగస్ట్‌ డెరివేటివ్స్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ట్రేడర్లు కొత్త పొజిషన్లకు ఆసక్తి చూపడంతో పాటు షార్ట్‌ కవరింగ్‌కు పూనుకున్నారు. ఆరు రోజుల వరుస పతనం అనంతరం అధిక

అంచనాల్ని మిం‍చిన మారుతి ఫలితాలు...పెరిగిన షేరు

Friday 26th July 2019

కానీ 27 శాతం క్షీణించిన లాభాలు మారుతి సుజుకి జూన్‌ త్రైమాసికంలో మార్కెట్ల అంచనాల కంటే మెరుగైన పనితీరును కనబరిచింది. ఈ కంపెనీ శుక్రవారం మధ్యాహ్నం తన జూన్‌ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలు వెల్లడికాకముందు రూ.5,700 దిగువకు పడిపోయిన మారుతి సుజుకి షేరు...ఫలితాల వెల్లడి తర్వాత 2.5 శాతం లాభంతో రూ. 5,900పైకి ఎగబాకింది. చివరకు ఎన్‌ఎస్‌ఈలో 0.85 శాతం లాభంతో రూ. 5,805 వద్ద ముగిసింది. తక్కువ అమ్మకాల పరిమాణం,

Most from this category