News


ఎన్‌బీఎఫ్‌సీలో బజాజ్‌ ఫైనాన్స్‌ రూటు వేరు!

Friday 21st June 2019
Markets_main1561113185.png-26477

ఇండియా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ) రుణాల చెల్లింపులు జరగక ఎన్‌బీఎఫ్‌సీ రంగం కుదేలయిపోతుంటే బజాజ్‌ ఫైనాన్స్‌ మాత్రం ఈ ఏడాది టాప్‌ స్టాక్‌లో ఒకటిగా నిలిచింది.  2018 అగష్టు నుంచి ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు 25 శాతం మేర నష్టపోయాయి. కొన్ని కంపెనీలు 89శాతం నష్టపోయాయి కూడా. కానీ బజాజ్‌ ఫైనాన్స్‌ 36శాతం లాభంతో సెన్సెక్స్‌లో ముందుంది. వినియోగ ఆధారిత రంగాలలో రుణాలను ఇవ్వడం, రూరల్‌, మధ్యస్థ వ్యాపారాలకు రుణాలు ఇవ్వడం వలన  మొండి బకాయిలు తగ్గాయి. ఫలితంగా కంపెనీ బ్యాడ్‌ లోన్‌ నిష్పత్తి 1.5గా ఉంది. వీటి ప్రత్యర్థి కంపెనీలైన శ్రీరామ్‌ ట్రాన్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ మొండి బకాయిలు 8.8 శాతంగా ఉండగా, మహింద్రా హౌసింగ్‌ ఫైనాన్స్‌ మొండి బకాయిలు 9.7 శాతంగా ఉన్నాయి.  
     ‘ఎన్‌బీఎఫ్‌సీలోని ఇతర సంస్థలలా బజాజ్‌ పైనాన్స్‌ కేవలం గృహ రుణాలనే ఇవ్వలేదు. వాళ్లు ఈ పరిధిని దాటారు. లాభపడ్డారు’ అని నార్‌నోలియా సెక్యురిటీష్‌ ఎనలిస్ట్‌ దిపక్‌ కుమార్‌ అన్నారు.  దీంతో పాటు కంపెనీ వారి డీలర్స్‌తో పనిచేయడం వలన కంపెనీ కార్యచరణ ఖర్చులు తగ్గాయని ఆయన తెలిపారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ తన తక్కువ కాల వ్యవధి డిబెంచర్లకు తిరిగి చెల్లించలేకపోవడం వలన ఇతర ఎన్‌బీఎఫ్‌సీలపై ఉన్న నమ్మకం కూడా సన్నగిల్లింది.



You may be interested

లాభాలు ఒక్కరోజుకే పరిమితం

Friday 21st June 2019

మార్కెట్‌ నిన్నటి ట్రేడింగ్‌లో ఆర్జించిన లాభాలన్ని నేడు హరించుకుపోయాయి. ఫలితంగా సూచీలు లాభాలు ఒకరోజుకే పరమితమయ్యాయి. సెన్సెక్స్‌ 407 పాయింట్లను నష్టపోయి 39,194 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 107 పాయింట్లను కోల్పోయి 11750ల దిగువను 11,724 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చల సఫలంపై ఆందోళనలు సూచీల నష్టాల ముగింపు కారణమయ్యాయి. నేడు కొత్త ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్‌ అధ్యక్షతన

బ్రోకరేజి బై రేటింగ్‌ ఇచ్చిన 10 స్టాకులు

Friday 21st June 2019

సిఫార్సు: యాంటిక్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ పినిక్స్‌ మిల్స్‌: కొనుగోలు; టార్గెట్‌ ధర: రూ. 800 పినిక్స్‌ మిల్స్‌ లి.(పీఎమ్‌ఎల్‌)కు దేశంలోని రియల్‌ ఎస్టెట్‌ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం  ఉంది. దీంతో పాటు రిటైల్‌ మాల్‌ నిర్వహణలో అతి పెద్దది. రిటైల్‌, ఆఫిస్‌, రెసిడెన్సియల్‌ విభాగాలలో కూడా పనిచేస్తోంది. ఇప్పుడు వార్షిక ఆస్తులకు ఐదు వేరు వేరు పట్టణాలలో 49 లక్షల చదరపు అడుగుల మాల్‌ స్థలాన్ని, 9.6లక్షల చ.అ గల ఆఫిస్‌

Most from this category