STOCKS

News


బజాజ్‌ కన్జూమర్‌కు క్యూ3 షాక్‌

Tuesday 11th February 2020
Markets_main1581405903.png-31691

7.5 శాతం పతనమైన షేరు 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరును ప్రదర్శించడంతో బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ లిమిటెడ్‌ కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో బజాజ్‌ గ్రూప్‌లోని ఈ కంపెనీ షేరు భారీ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం..

నేలచూపులో
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌ సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచాయి. దీంతో ఈ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో ఈ షేరు 7.5 శాతం పతనమై రూ. 205 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 201 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. క్యూ3లో ఎఫ్‌ఎంసీజీ రంగ కంపెనీ బజాజ్‌ కన్జూమర్‌ రూ. 50 కోట్ల నికర లాభం ఆర్జిం‍చింది. ఇది దాదాపు 17 శాతం క్షీణతకాగా.. మొత్తం ఆదాయం సైతం 8 శాతం నీరసించి రూ. 211 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ ప్రాతపదికన నిర్వహణ లాభం(ఇబిటా) 24 శాతం క్షీణించి రూ. 56 కోట్లకు పరిమితమైంది. ఇబిటా మర్జిన్లు సైతం 32.6 శాతం నుంచి 27 శాతానికి బలహీనపడ్డాయి. కాగా.. తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ కలిపి 5.3 లక్షల షేర్లు చేతులు మారడం గమనార్హం!



You may be interested

ఆటో స్టాక్స్‌ అప్‌

Tuesday 11th February 2020

చైనాపై ఆందోళన తగ్గడం.. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లు పుంజుకోవడంతో మంగళవారం ఆటో షేర్‌ ఇండెక్స్‌ 0.91 శాతం పెరిగి 7,932.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. టాటా మోటార్స్‌ షేరు 2.84 పెరిగి 173.70 వద్ద, మారుతీ  షేరు 2.37 పెరిగి 7,056.00 వద్ద, బజాజ్‌ ఆటో షేరు 1.41 పెరిగి 43.70 వద్ద, అశోక్‌ లేలాండ్‌ షేరు 1.27 పెరిగి 84.00 వద్ద, హీరో మోటర్‌ కార్ప్‌ షేరు 1.02

మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే..!

Tuesday 11th February 2020

ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం భారీ లాభంతో మెదలైంది. చైనాలో కరోనా వైరస్‌ వ్యాధితో మృతుల సంఖ్య రోజురోజూకూ పెరుగుతున్నప్పటికీ.., ఈ దేశంలో సోమవారం కొన్ని కంపెనీలు పునఃప్రారంభం కావడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కొంత ఊరటను కలిగించింది. గతంలో సంభవించిన సార్స్‌ అంటువ్యాధి కంటే ఈ కరోనా వైరస్‌ వ్యాధితోనే ఎ‍క్కువ మంది మృత్యువాత పడ్డారు. చైనా అధికారిక గణాంకాల

Most from this category