News


బజాజ్‌ కన్జ్యూమర్‌ 15% ర్యాలీ!

Wednesday 16th October 2019
Markets_main1571204558.png-28920

  బజాజ్‌ రీసోర్సెస్‌, బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌లో తన 22 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవి ద్వారా రూ. 628 కోట్లకు మంగళవారం విక్రయించింది. ఫలితంగా బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ షేరు విలువ బుధవారం ట్రేడింగ్‌లో ఉదయం 11.01 సమయానికి  15.76 శాతం లాభపడి రూ. 235.75 వద్ద ట్రేడవుతోంది. బజాజ్‌ రీసోర్సెస్‌ మొత్తంగా 3,22,65,100 బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ షేర్లను షేరు రూ. 194.56 చొప్పున, రూ. 628 కోట్లకు విక్రయించిందని ఎక్సేంజ్‌ డేటా పేర్కొంది. కాగా సెప్టెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌లో బజాజ్‌ రిసోర్సెస్‌ 59.9 శాతం వాటాను కలిగివుంది. గత సెషన్లో 2.90 శాతం లాభపడి రూ. 203.65 వద్ద ముగసిన బజాజ్‌ కన్జ్యూమర్‌ షేరు, బుధవారం ట్రేడింగ్‌లో రూ. 225.00 వద్ద పారంభమై, రూ. 242.70 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 



You may be interested

బడా షేర్లపైనే ఇన్వెస్టర్ల దృష్టి!

Wednesday 16th October 2019

ప్రస్తుత ఒడిదుడుకుల మార్కెట్లో ఆయా రంగాల్లో టాప్‌ స్టాకులను మాత్రమే ఇన్వెస్టర్లు నమ్ముకుంటున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ఆయా రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువకు, దాని తర్వాత రెండో స్థానంలో ఉన్న కంపెనీ మార్కెట్‌ విలువకు మధ్య వ్యత్యాసం గత రెండేళ్లలో మరింత పెరుగుతూ వస్తోందని వివరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రిస్కీ మార్కెట్లో కేవలం అగ్రస్థానంలో ఉన్న కంపెనీల షేర్లపై మాత్రమే ఇన్వెస్టర్లు భరోసా

బీపీసీఎల్‌ షేరు వాటా విక్రయ ధర రూ. 510- 1110?

Wednesday 16th October 2019

నిపుణుల అంచనా ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ చేస్తుందన్న వార్తల నడుమ గత నెల్లో బీపీసీఎల్‌ షేరు దాదాపు 28 శాతం ర్యాలీ జరిపింది. ఇందులో వాటాలను ఒకే కొనుగోలుదారుకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సంస్థ విలువ మదింపు చేసేందుకు తాజాగా బిడ్డింగ్‌ ప్రక్రియను ఆరంభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ విలువ, ఇతర వివరాలపై నిపుణుల అంచనాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం కంపెనీ ఎంటర్‌ప్రైజ్‌ వాల్యూ, వచ్చే సంవత్సరం కంపెనీ ఎబిటా

Most from this category