News


బజాజ్‌ కన్జ్యుమర్‌ 6% అప్‌

Thursday 17th October 2019
Markets_main1571289638.png-28946

   బజాజ్‌ రీసోర్సెస్‌, బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌లో తన 22 శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవి ద్వారా రూ. 628 కోట్లకు మంగళవారం విక్రయించిన విషయం తెలిసిందే. రుణాలను చెల్లించేందుకు ఈ నిధులను వినియోగించనున్నామని కంపెనీ తెలిపింది. ఫలితంగా గత కొన్ని సెషన్‌ల నుంచి బజాజ్‌ కన్జ్యుమర్‌ షేరు పాజిటివ్‌గా ట్రేడవుతోంది. గత సెషన్‌లో 15 శాతానికి పైగా ర్యాలీ చేసిన ఈ షేరు, గురువారం ఉదయం 10.43 సమయానికి 6 శాతం లాభపడి రూ. 259 వద్ద ట్రేడవుతోంది.
    బజాజ్‌ రీసోర్సెస్‌ మొత్తంగా 3,22,65,100 బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ షేర్లను షేరు రూ. 194.56 చొప్పున, రూ. 628 కోట్లకు విక్రయించిందని ఎక్సేంజ్‌ డేటా పేర్కొంది. కాగా సెప్టెంబర్‌ త్రైమాసికం చివరి నాటికి బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌లో బజాజ్‌ రిసోర్సెస్‌ 59.9 శాతం వాటాను కలిగివుంది. గత సెషన్లో  రూ. 244.35 వద్ద ముగసిన బజాజ్‌ కన్జ్యూమర్‌ షేరు, బుధవారం ట్రేడింగ్‌లో రూ. 252.00 వద్ద పారంభమై, రూ. 271.20 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 



You may be interested

షేర్లపై జీడీపీ ప్రభావం చాలా స్వల్పం!

Thursday 17th October 2019

ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా జీడీపీ వృద్ధికి, స్టాక్స్‌ ధరలు మధ్య చాలా స్వల్ప సంబంధం ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌నివేదిక వెల్లడించింది. అయితే ఆశ‍్చర్యకరంగా జీడీపీ ట్రెండ్‌ను తెలుసుకోవడానికి మాత్రం స్టాక్‌ ధరలు మంచి సూచికలుగా పనికివస్తాయని తెలిపింది. కానీ జీడీపీ ట్రెండ్‌ ఆధారంగా స్టాక్స్‌ ధరలను అంచనా వేయలేమని పేర్కొంది. స్టాక్స్‌ ధరలు పెరగడమనేది జీడీపీ నిజ వృద్ధికి అనులోమానుపాతంలో ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ తాజా రిసెర్చ్‌ప్రకారం కార్పొరేట్‌

మార్కెట్‌ జోరు తగ్గుతోందా?!

Thursday 17th October 2019

సంకేతాలున్నాయంటున్న నిపుణులు నిఫ్టీ ఈవారాన్ని లాభాలతో కొనసాగిస్తున్నా, సూచీల్లో జోరు సన్నగిల్లుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. బుల్స్‌ ఇకమీదట ఉత్సాహంగా పరుగులు తీయలేకపోవచ్చని భావిస్తున్నారు. దీనివల్ల స్వల్పకాలానికి ఒక శ్రేణిలోనే మార్కెట్‌ కదలికలుండవచ్చని అంచనా వేస్తున్నారు. బుధవారం నిఫ్టీ సుమారు 36 పాయింట్లు లాభపడింది. గురువారం వీక్లీ ఆప్షన్‌ ఎక్స్‌పైరీ ఉన్నందున సూచీలు తీవ్ర కదలికలు నమోదు చేయవచ్చని అంచనా. ప్రస్తుతానికి నిఫ్టీకి 11500- 11585 పాయింట్ల జోన్‌

Most from this category