News


ఆరంభం అంతంతమాత్రం... కానీ!

Friday 6th September 2019
Markets_main1567746584.png-28233

ముగింపు సమయానికి లాభాల్లోకే..
సెప్టెంబర్‌ సీరిస్‌పై బ్రోకరేజ్‌ల అంచనా
వరుసగా మూడు సీరిస్‌లు నెగిటివ్‌గా క్లోజయిన దేశీయ మార్కెట్లు సెప్టెంబర్‌ ఎఫ్‌ అండ్‌ ఓ సీరిస్‌ను పేలవంగా ఆరంభించాయి. దేశీయ ఆర్థిక మందగమనంపై ఆందోళనలు మార్కెట్లో నెగిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమవుతున్నాయి. అయితే గతంలో పరిశీలిస్తే సెప్టెంబర్‌ సీరిస్‌ ఎక్కువమార్లు లాభదాయకంగానే ముగిసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిఫ్టీలో డెరివేటివ్స్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి కేవలం ఒక్కమారు (2002)లో మాత్రమే సూచీలు వరుసగా నాలుగు సీరిస్‌లు నష్టాలు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఐదు మార్లు వరుసగా మూడు నెలలు నష్టాలు చవిచూడడం జరిగింది. ఇలా మూడు వరుస సీరిస్‌లు నష్టాలు చూసిన మార్కెట్లు నాలుగో నెల్లో దాదాపు 2 శాతం లాభపడినట్లు చరిత్ర చెబుతోందని ఎడెల్‌వీజ్‌ పేర్కొంది. ఇదే ట్రెండ్‌ ఈసారి కూడా రిపీటయ్యేందుకు ఎక్కువ ఛాన్సులున్నాయని నిపుణులు భావిస్తున్నారు.ఇప్పటికే మూడు ఎక్స్‌పైరీల్లో కలిపి నిఫ్టీ దాదాపు 8 శాతం క్షీణించినందున ఈ నెల సీరిస్‌లో పతనానికి అడ్డుకట్ట ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే లాభాలు కూడా పరిమితంగానే ఉంటాయంటున్నారు. 

మూడు వరుస సీరిస్‌ల నష్టాలు , అనంతర స్పందన

యూఎస్‌ ట్రేడ్‌ టెన్షన్లకు కొత్తగా దేశీయ మందగమన భయాలు తోడవడంతో మార్కెట్లలో సెంటిమెంట్‌ బాగా నెగిటివ్‌గా మారింది. ఒకపక్క ఆర్థిక మంత్రి ప్రోత్సాహక చర్యలు ప్రకటించినా, సూచీలు పెద్దగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో తాము సెప్టెంబర్‌ సీరిస్‌పై చాలా జాగ్రత్తగా ఉన్నామని, గత చరిత్ర ప్రకారం ఈ సీరిస్‌లో లాభాలకు అవకాశమున్నా, ముందు నష్టాలైతే రావచ్చని ఎడెల్‌వీజ్‌ హెచ్చరించింది. ఐసీఐసీఐ డైరెక్ట్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, సెప్టెంబర్‌ సీరిస్‌ చివరకు లాభాలు వచ్చినా ముందైతే నష్టాల్లోకి వెళ్లవచ్చని తెలిపింది. సాధారణంగా వరుసగా రెండు మూడు సీరిస్‌లు నష్టాల్లో ముగిస్తే సూచీలు కొంత లాభం చూపడం ఉంటుందని, కానీ ఇప్పటికైతే మార్కెట్లో నెగిటివ్‌ ధృక్పథమే ఉందని తెలిపింది. బ్యాంకుల విలీనం దీర్ఘకాలంలో మేలు చేయవచ్చని, కానీ స్వల్పకాలానికి క్రెడిట్‌ గ్రోత్‌ను దెబ్బతీయవచ్చని, గత విలీన సమయాల్లో ఇలాగే జరిగిందని జెఫర్రీస్‌ తెలిపింది. అయితే లిక్విడిటీ సమస్య తీర్చేందుకు ప్రభుత్వం తప్పక కొన్ని చర్యలు ప్రకటించవచ్చని ఆశలున్నట్లు తెలిపింది. నిఫ్టీకి 10585 పాయింట్ల వద్ద మద్దతు ఉందని ఎడెల్‌వీజ్‌ సూచించింది. 



You may be interested

పసిడి....మూడేళ్లలో అతిపెద్ద పతనం

Friday 6th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం మూడేళ్ల తరువాత ఒకే రోజులో​ అతిపెద్ద పతనాన్ని చవిచూసి రెండువారాల కనిష్టానికి దిగివచ్చింది. వచ్చే నెలలో అమెరికా చైనాల మధ్య మరో దఫా వాణిజ్య చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకరించడటంతో అమెరికాతో పాటు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు ఉత్సానిచ్చింది. అమెరికాలోని ప్రైవేట్‌ రంగంలో అంచనాలకు మించి ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు వెలువడటం‍తో ఆర్థిక మాంద్య భయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ రెండు అంశాలు

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 6th September 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు బజాజ్‌ ఫైనాన్స్‌:- క్యూఐపీ ద్వారా నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు ఈ సెప్టెండర్‌ 17న కంపెనీ బోర్డు సమావేశాన్ని నిర్వహించునుంది. టీసీఎస్‌:- పోస్టెన్ నార్జ్ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  డాటామాస్టిక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌:- బెంగళూర్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్ట్‌ తన డిజిటల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ భాగస్వామిగా ఎన్నుకుంది.  ప్రభాత్‌ డైరీ:- డీలిస్టింగ్‌ ప్రపోజల్‌పై చర్చించేందకు సెప్టెంబర్‌ 10న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. ఇండోసోలార్‌:- కం‍పెనీ సీఈవోగా అనంద్‌ కుమార్‌

Most from this category