News


అయోధ్య తీర్పు మార్కెట్లకు సానుకూలం: విశ్లేషకులు

Saturday 9th November 2019
Markets_main1573293517.png-29478

అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు శనీవారం తీర్పిచ్చింది. వివాదంలో ఉన్న మొత్తం 2.77 ఎకరాల భూమిని రామమందిరం నిర్మణానికే కేటాయించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని తేల్చింది. కాగా సుమారుగా వందేళ్ల నుంచి నలుగుతున్న వివాదం కొలిక్కి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్లకు మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పుతో దేశంలోని ప్రధాన రాజకీయ, విధాన పరమైన అనిశ్చితి ముగిసిందని అన్నారు. దీంతో ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకం బలపడుతుందని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అంచనావేస్తున్నారు. 
‘మార్కెట్‌పై దీని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. వ్యవస్థను సరళతరం చేసే ఎటువంటి నిర్ణయమైనా, ఇండియాపై విదేశీ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచుతుంది’ అని కేఆర్‌ చోక్సి ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, ఎండీ దివాన్‌ చోక్సి అన్నారు.
 ‘దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దేశం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే, ఖచ్చితంగా ఉత్తర ప్రదేశ్‌ వాటా లక్ష కోట్ల డాలర్లుగా ఉండాలి’ అని సీనియర్‌ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా అభిప్రాయపడ్డారు.

 ‘మొదట కశ్మీర్‌ 370 ఆర్టికల్‌ తొలగింపు, తర్వాత ఇది. దేశీయ వ్యవస్థ సరళమవుతోంది.. ఎల్‌టీసీజీ, వ్యక్తిగత పన్ను రేట్లను మార్చడం వంటి సంస్కరణలు మరిన్ని వస్తాయని అనిపిస్తోంది’ అని సంజయ్‌ భాసిన్‌ అన్నారు. అంతేకాకుండా మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నానని, బెంచ్‌ మార్క్‌ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరడం ఇక సులభమని తెలిపారు.
ఈ తీర్పు వలన అయోధ్యను సందర్శించి దేశీయ, విదేశీ టూరిస్ట్‌లు రోజుకు 50,000 నుంచి 1 లక్షకు చేరుకుంటారని కేడియా అన్నారు. ‘ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మార్చిన వైష్ణోదేవి, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లానే అయోధ్య కూడా మారుతుంది’ అని అభిప్రాయపడ్డారు. You may be interested

ఐపీవో ఇష్యూ ధరపై భారీ లాభాలు!

Monday 11th November 2019

మంచి వ్యాపారాలతో కూడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్నింటి వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నా కానీ, వారు వెనుకాడడం లేదు. భవిష్యత్తు వృద్ధి అవకాశాలు వారిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ముగిసిన ఐపీవోలను పరిశీలిస్తే కొన్ని ఇష్యూ ధర నుంచి ఇప్పటి వరకు మంచి లాభాలనే ఇచ్చాయి.    ఈ ఏడాది ఐపీవో ఇష్యూల్లో కొన్ని మంచి సక్సెస్‌ సాధించాయి. 10 కంపెనీలు వాటి ఇష్యూ

నష్టాల్లో ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 9th November 2019

అమెరికాలో మార్కెట్లో ట్రేడయ్యే భారత్‌కు చెందిన అమెరికన్‌ డిపాజిటరీ రీసీట్‌ (ఏడీఆర్‌)లు శుక్రవారం రాత్రి నష్టాలతో ముగిశాయి.  అత్యధికంగా ఇన్ఫోసిన్‌ ఏడీఆర్‌ 3.50 నష్టపోయి 9.68డాలరు వద్ద స్థిరపడింది. ఇదే షేరు శుక్రవారం ఇక్కడ 1.64 శాతం నష్టంతో రూ.708.30 వద్ద ముగిసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.14శాతం పతనమై 39.90డాలర్ల వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.46శాతం నష్టపోయి 61.81వద్ద ముగిశాయి. టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ 2.15శాతం క్షీణించి 11.86 వద్ద

Most from this category