News


ఈ ఆరు రంగాల షేర్లూ పెట్టుబడికి అనుకూలం!

Thursday 19th September 2019
Markets_main1568888241.png-28436

సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి జరిగాక చమురు ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు తమ కీలక మద్ధతు స్థాయిలను కొల్పోవలసి వచ్చింది. చాలా వరకు స్టాకులు భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. ఇవి ప్రస్తుతం మంచి వాల్యుషన్‌ల దగ్గర లభ్యమవుతున్నాయని, కానీ రాయితీతో ట్రేడయ్యే ప్రతీ స్టాకు మంచి రిటర్న్‌లను ఇవ్వదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిర్థిష్ట రంగాల వారిగా ప్రాథమిక అంశాలు బలంగా ఉండడంతో డిస్కౌంట్‌తో ట్రేడవుతున్న కొన్ని స్టాకులు ఇప్పటికి కూడా ఆకర్షణీయమైన వాల్యుషన్‌ను కలిగి ఉన్నాయని అన్నారు. 
   ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సియల్‌ కంపెనీలు), వినియోగ రంగం, రిటైల్, టెక్నాలజీ రంగం వంటి ఆరు రంగాలు వాటి దీర్ఘకాలిక సగటు కంటే డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నాయి. ‘గత పదేళ్ల కాలంలో ఎన్‌బీఎఫ్‌సీ, వినియోగ రంగం, రిటైల్‌ వంటి సెక్టార్లలో పీఈ(ప్రైస్‌ టూ ఎర్న్‌ రేషియో) పెరుగుతూ వస్తుంది. ’ అని యాక్సిస్ సెక్యురిటీస్‌, ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్, పంకజ్ బొబాడే అన్నారు. ‘ప్రస్తుతం దేశీయంగా ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో మార్కెట్‌లకు దూరంగా ఉండాలని ఇన్వెస్టర్లు ఆలోచిస్తారు. కానీ ఈ రంగాల ప్రాథమిక బలాన్ని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం’ అని అన్నారు. అంతేకాకుండా ఈ రంగాలలో గత పదేళ్లలో చూసిన వృద్ధి కన్నా అధిక వృద్ధిని వచ్చే ఐదేళ్లలో చూడవచ్చని అభిప్రాయపడ్డారు. ‘మార్కె‍ట్‌లు వాటి గరిష్ఠాల నుంచి భారీగా దిద్దుబాటుకు గురవ్వడంతో ఈ రంగాలు మంచి రాయితీతో ట్రేడవుతున్నాయి. వీటిలో ప్రవేశించడానికి ఇదే మంచి సమయం​‍’ అని అన్నారు. 
 
వివిధ రంగాలపై పంకజ్ బోబాడే విశ్లేషణ:
ప్రైవేట్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రభుత్వరంగ బ్యాంకులు
నిరుత్సాహపరిచిన ఆదాయాల సీజన్‌లో ఆస్తుల నాణ్యతను మెరుగుపరుచుకుంటూ.. ప్రైవేట్‌ బ్యాంక్‌లు మంచి ఫలితాలను ప్రకటించాయి. కానీ ఇతర రంగాలు గత కొన్ని త్రైమాసికాల నుంచి అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుండడం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌యూ)ను విలీనం చేయడంతో పాటు ఆస్తుల నాణ్యతను మెరుగుపరచడానికి కఠిన నిబంధనలను అమలు చేయడంతో పీఎస్‌యూ బ్యాంకులు రుణాలను ఇవ్వడంలో కొన్ని పరిమితులు ఏర్పాడ్డాయి. ఇది ప్రైవేట్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మంచి అవకాశంగా మారింది.
ఐటీ కంపెనీలు
అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో టెక్నాలజీ కంపెనీలకు డిమాండ్‌ పెరుగుతుండడం గమనించవచ్చు. డిజిటల్‌ సొల్యుషన్స్‌కు మేనేజమెంట్‌ అధిక ప్రాధాన్యం ఇస్తుండడం కూడా ఈ కంపెనీల డిమాండ్‌ పెరగడానికి కారణమవుతున్నాయి. 
వినియోగం, రిటైల్‌ రంగాలు
గత త్రైమాసికంలో గ్రామీణ ఆర్థిక వృద్ధి మందగించడంతో ఈ రంగాలు స్వల్ప కాల ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. కానీ సాధారణ రుతుపవనాలు ఉండడంతో సెంటిమెంట్‌ తిరిగి పుంజుకుంది. దీర్ఘకాలానికి గాను ఈ రంగాలు బాగున్నాయి.

 You may be interested

సెన్సెక్స్‌ నష్టం 476 పాయింట్లు

Thursday 19th September 2019

136 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ మార్కెట్‌ లాభాల ముగింపు ఒకరోజుకే పరిమితమైంది. సూచీలు గురువారం మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌  470 పాయింట్లను కోల్పోయి 36,093.47 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు నష్టపోయి 10,705 వద్ద స్థిరపడ్డాయి. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నిన్నరాత్రి అందరి అంచనాలకు తగ్గట్లుగానే వడ్డీరేట్లపై పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే లేబర్‌ మార్కెట్‌ బలంగా ఉన్నందున రేట్ల కోత ఈ ఏడాది ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో భవిష్యత్‌లో

లాభాల్లో టాటా మోటర్స్‌, మారుతి సుజుకీ

Thursday 19th September 2019

మార్కెట్‌ భారీపతనంలోనూ టాటామోటర్స్‌, మారుతి సుజుకీ షేర్లు లాభాల బాట పట్టాయి. రేపు (సెప్టెంబర్‌ 20న) జరగనున్న జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో మందగించిన ఆటోరంగాన్ని ఉత్తేజపరిచేందుకు అటో రంగంపై జీఎస్‌టీ శ్లాబ్‌ను తగ్గింవచ్చనే అంచనాలతో ఈ షేర్లకు కొనుగోళ్ల లభిస్తుంది.  టాటా మోటర్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.123.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.50శాతం లాభపడి రూ.124.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు క్రితం ముగింపు ధర(రూ.121.75)తో

Most from this category