News


ఫలితాలతో..నష్టాల్లో యాక్సిస్‌ బ్యాంక్‌

Wednesday 31st July 2019
Markets_main1564547161.png-27429

యాక్సిస్‌ బ్యాంక్‌ క్యూ1 ఫలితాలు మార్కెట్ల అంచనాలను అం‍దుకోలేకపోవడంతో బుధవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు ఉదయం 9.41 సమయానికి 3.72 శాతం నష్టపోయి రూ. 681.25 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ తన క్యూ1 ఫలితాలలో నికర లాభం రూ. 1,370 కోట్లగా పేర్కొంది. ఇది మార్కెట్‌ అంచనా వేసిన ఈ కంపెనీ నికర లాభం రూ. 1,850 కోట్ల కంటే తక్కువ కావడం గమనర్హం. కానీ గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.701 కోట్ల నికర లాభాన్ని నమోదుచేయగా, ప్రస్తుత క్యూ1 ఫలితాలలో  95 శాతం నికర లాభ వృద్ధిని నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.15,702 కోట్ల నుంచి రూ.19,124 కోట్లకు పెరిగిందని , బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడిందని కంపెనీ తెలిపింది. గత క్యూ1లో 6.52 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 5.25 శాతానికి తగ్గాయని, నికర మొండి బకాయిలు 3.09 శాతం నుంచి 2.04 శాతానికి తగ్గాయని పేర్కొంది. కానీ కేటాయింపులు రూ.3,338 కోట్ల నుంచి రూ.3,815 కోట్లకు పెరిగాయని వివరించింది. 



You may be interested

కాఫీ డే షేరు...మరో 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌

Wednesday 31st July 2019

 నిలిచిపోయిన 1.34 కోట్ల  షేర్ల అమ్మకం  కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ మృతదేహాం బుధవారం ఉదయం బయటపడడంతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ బుదవారం(జులై 31) ట్రేడింగ్‌లో మరో 20 శాతం నష్టపోయి రూ. 122.75  వద్ద డౌన్‌ సర్య్కూట్‌ ఫ్రీజ్‌ అయ్యింది. ఉదయం 10.15 సమయానికి ఎన్‌ఎస్‌ఈలో 1,34,45,904 షేర్లు అమ్మకపు అర్డర్లు పేరుకుపోయాయి.  ఈ షేరు క్రితం రోజు సైతం 20 శాతం డౌన్‌సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే.

సీసీడీలో 6 శాతం వాటా ఉంది: కేకేఆర్‌

Wednesday 31st July 2019

సీసీడీ వ్యవస్థాపకుడు సిద్దార్థ అదృశ్యం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం కేకేఆర్‌ పేర్కొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్దార్థపైన నమ్మకంతో సీసీడీలో తాము తొమ్మిదేళ్ల క్రితం చేసిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని గతేడాది విక్రయించామని.. దీంతో తమ వాటా 10.3 శాతం నుంచి ప్రస్తుతం 6 శాతానికి పరిమితమైనట్లు కేకేఆర్‌ ఒక

Most from this category