News


వాటా విక్రయంతో యాక్సిస్‌ బ్యాంక్‌ హెచ్చుతగ్గులు

Thursday 27th June 2019
Markets_main1561629271.png-26629

యాక్సిస్‌బ్యాంక్‌ షేరు గురువారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యింది. ఒకదశలో ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.806.65 నుంచి 2 శాతం నష్టపోయి రూ.781 వద్దకు తగ్గిన యాక్సిస్‌ బ్యాంక్‌ తిరిగి పుంజుకుని రూ. 800 సమీపంలో క్లోజయ్యింది. కంపెనీ షేర్ల అమ్మకం ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 130 కోట్ల డాలర్లను సమీకరించనుందని బ్లుమ్‌బర్గ్‌ వార్తా సంస్థ నివేదించడంతో ఈ షేరులో హెచ్చుతగ్గులు నెలకొన్నాయి. రూ.789.35 వద్ద ప్రారంభమై, మొదట్లోనే  2శాతం లాభపడి రూ.806.65కు చేరుకుంది. గత సెషన్‌లో బీఎస్‌ఈలో రూ.784.60 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 
 



You may be interested

ఎఫ్‌అండ్‌ఓ నుంచి నిష్క్రమించే స్టాకులను ఏం చేద్దాం?

Thursday 27th June 2019

జూన్‌ సీరిస్‌తో 34 స్టాకులు ఎఫ్‌అండ్‌ఓ నుంచి వైదొలగుతున్నాయి. ఈ స్టాకులను ఫ్యూచర్స్‌ విభాగం నుంచి తొలగిస్తున్నట్లు ఏప్రిల్‌లోనే ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇలా ఎఫ్‌అండ్‌ఓ నుంచి నిష్క్రమిస్తున్న స్టాకుల్లో ఆర్‌పవర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, జైన్‌ ఇరిగేషన్‌, పీసీ జువెల్స్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, సీజీ పవర్‌, సియట్‌, అజంతా ఫార్మా, ఐడీఎఫ్‌సీ, కావేరీ సీడ్స్‌, సౌత్‌ ఇండియా బ్యాంక్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ తదితరాలున్నాయి. మార్కెట్‌ క్యాప్‌ పరంగా దేశీయ కంపెనీల్లో టాప్‌500

లాభాల బాటలో టాటా మోటర్స్‌

Thursday 27th June 2019

అటోరంగ దిగ్గజం టాటా మోటర్స్‌ షేర్లు గురువారం 4.50శాతం లాభపడ్డాయి.అటో రంగ షేర్ల ర్యాలీలో భాగంగా నేడు ఈ కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.162.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో 4.22శాతం ర్యాలీ చేసి రూ.167.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు(రూ.161.1)తో పోలిస్తే 3.20శాతం లాభంతో

Most from this category