News


ఐసీఐసీఐ రికార్డు...2వారాల గరిష్టానికి యాక్సిస్‌

Friday 27th December 2019
Markets_main1577440624.png-30480

శుక్రవారం ట్రేడింగ్‌ తొలిదశలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు ర్యాలీ జరపగా, మధ్యాహ్న సెసన్‌లో ప్రైవేటు రంగ బ్యాంకులు దూకుడు ప్రదర్శించాయి. ఈ క్రమంలో ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.550,50 స్థాయిని చేరి సరికొత్త జీవితకాల రికార్డుస్థాయిని నమోదుచేసింది. మరో ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు శుక్రవారం 2వారాల గరిష్ట స్థాయిని తాకింది. నేడు ఎన్ఎస్‌ఈలో ఈ షేరు రూ.739.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్లతో ఈ షేరు ఇంట్రాడేలో 3.15శాతం పెరిగి రూ.760 వద్ద  గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు 2వారాల గరిష్టస్థాయి కావడం విశేషం.కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 603.45లు, రూ.827.75లుగా నమోదయ్యాయి. నిఫ్టీలో టాప్‌-5 గెయినర్లలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 



You may be interested

సెన్సెక్స్‌ 411, నిఫ్టీ 119 పాయింట్లు అప్‌

Friday 27th December 2019

12250 చేరువలో ముగిసిన నిఫ్టీ మూడు రోజుల నష్టాలకు ముగింపు  రాణించిన బ్యాంకింగ్‌, అటో, అర్థిక రంగ షేర్లు  జనవరి డెరివేటివ్‌ సిరీస్‌కు శుభారంభాన్ని పలుకుతూ, మూడు రోజుల నష్టాలకు చెక్‌పెడుతూ మార్కెట్‌ శుక్రవారం భారీ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, అటో, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో  ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు 1శాతం లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 411 పాయింట్ల లాభంతో 41,575.14 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119.25 పాయింట్లు పెరిగి

స్వల్ప కాలానికి స్టాక్‌ సిఫార్సులు

Friday 27th December 2019

నాలుగు రోజుల నష్టాల ముగింపు అనంతరం శుక్రవారం సూచీలు లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం ఇందుకు కారణమైంది. మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ 350 పాయింట్లు ఆర్జించింది. నిఫ్టీ 12200 పైన ట్రేడ్‌ అవుతోంది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన షేర్ల ర్యాలీ సూచీలను పరుగులు పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌ నిపుణులు స్వల్పకాలికానికి కొన్ని షేర్లను సిఫార్సు చేస్తున్నారు. కునాల్‌ బోత్రా నుంచి 

Most from this category