News


3వారాల కనిష్టానికి యాక్సిస్‌ బ్యాంక్‌

Monday 17th June 2019
Markets_main1560762530.png-26351

యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు సోమవారం 2.46శాతం నష్టపోయి రూ.781,50 వద్ద ట్రేడవుతోంది.  గత నెల 27 తర్వాత ఈ షేరుకి ఇదే కనిష్ఠ స్థాయి. ఏప్రిల్‌ 27,2018 కనిష్ఠ స్థాయి నుంచి జూన్‌ 4, 2019 గరిష్ఠ స్థాయి మధ్య గల 7శాతం ఫైబోనాక్కి రిట్రాస్‌మెంట్‌ స్థాయి  రూ. 803.48 వద్ద ఈ షేరుకు మద్ధతు ఉంది.  తాజాగా ఈ మద్దతు కోల్పోయింది. దీంతోపాటు 20రోజుల డీఎంఏ స్థాయి దిగువకు చేరింది. వేవ్‌ పద్ధతి ప్రకారం యాక్సిస్‌ బ్యాంక్‌ త్రీ వేవ్‌ అప్‌ ట్రేండ్‌ను పూర్తిచేసింది. ఇప్పుడు త్రీ వేవ్‌ డౌన్‌ ట్రెండ్‌ మొదలైందని మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌(ఎమ్‌ఏసీడీ) సూచీ శుక్రవారం సిగ్నల్‌ లైన్‌ కంటే దిగువకు ఉండడం కుడా నష్టాలకు గల అవకాశాన్ని తెలియజేస్తుదని నిపుణులంటున్నారు. దీంతోపాటు శుక్రవారం పారబొలిక్‌ ఎస్‌ఏఆర్‌ క్షీణించడం కూడా అప్‌ట్రెండ్‌ తిరోగమనాన్ని​ సూచిస్తుందని వివరించారు. యాక్సిస్‌ బ్యాంక్‌ షేరుకు 14.6శాతం రిట్రాస్‌మెంట్‌ స్థాయి రూ.777.15 వద్ద మరో మద్దతు ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు ఈ ఏడాది బీఎస్‌ఈలో 29.3శాతం  పెరిగింది. 



You may be interested

ఆర్‌ఎన్‌ఏఎమ్‌లో 10.75శాతం వాటాను విక్రయించిన ఆర్‌క్యాప్‌

Monday 17th June 2019

ఆర్‌క్యాప్‌ అప్పులను తగ్గించేందుకే రిలయన్స్‌ నిప్పాన్‌ ఎసెట్‌ మానెజ్‌మెంట్‌(ఆర్‌ఎన్‌ఏఎమ్‌)లో 10.75శాతం వాటాను రిలయన్స్‌ క్యాపిటల్‌(ఆర్‌క్యాప్‌) సోమవారం రెండు వరుస ఆఫర్‌లలో విక్రయించింది. వీటి విలువ రూ.1,450కోట్లని సంస్థ సోమవారం ప్రకటించింది. ఆర్‌క్యాప్‌కున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు నిప్పాన్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ, జపాన్‌కు ఈ వాటాను విక్రయించామని వివరించింది. దీంతో ఆర్‌క్యాప్‌ సంస్థ ఆర్‌ఎన్‌ఏఎమ్‌లో తన మెజార్టీ వాటాను కోల్పోయి 25శాతం వాటాతో మినిమమ్‌ షేర్‌ హోల్డర్‌గా మిగిలింది.  ఈ లావాదేవినే

ఐటీసీ టార్గెట్‌ ధరను తగ్గించిన సీఎల్‌ఎస్‌ఏ

Monday 17th June 2019

ఎఫ్‌ఎమ్‌జీసీ దిగ్గజం ఐటీసీ కంపెనీ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 1శాతం నష్టపోయాయి. ప్రముఖ రేటింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సిగరెట్‌ వ్యాపారంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐటీసీ షేరు టార్గెట్‌ ధరను తగ్గించడం ఇందుకు కారణమైంది. ‘‘2019-19 ఆర్థిక సంవత్సరంలో నిధుల ప్రవాహం తగ్గడంతో ఆదాయ నిష్పత్తిలో పెరుగుదల తగ్గముఖం పట్టింది. అధిక పన్నుల కారణంగా సిగరెట్ వ్యాపారం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే ఎఫ్‌ఎంజీసీ రంగం మాత్రం ఆశించిన స్థాయిలో

Most from this category