News


ఈ వారం ట్రేడింగ్‌ జోలికెళ్లొద్దు..

Monday 10th December 2018
Markets_main1544429001.png-22804

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు గత వారంలోని ఐదు ట్రేడింగ్‌ సెషన్లలోకెల్లా నాలుగు సెషన్లలో కరెక‌్షన్‌కు గురయ్యాయని ఈక్విటీ99 ఫౌండర్‌ సుమిత్‌ బిల్గైయన్‌ తెలిపారు. ఇదేసమయంలో గ్లోబల్‌ మార్కెట్లలోనూ తీవ్ర ఒడిదుడుకులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు మన మార్కెట్లపై నెగటివ్‌ ప్రభావం చూపాయని తెలిపారు. అయితే ఇప్పుడు అందరి కళ్లు డిసెంబర్‌ 11 నాటి ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీఫైనాల్స్‌గా భావించొచ్చని తెలిపారు. అందువల్ల సమీప కాలంలో మార్కెట్‌లో ఆటుపోట్లు ఉండొచ్చని అంచనా వేశారు. వచ్చేవారంలో ఇండెక్స్‌లు తీవ్ర ఒడిదుడుకులకు గురవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 3-5 రోజులు ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. నిఫ్టీకి 10,500-10,450 శ్రేణిలో బలమైన మద్దతు, 10,950-11,100 స్థాయిలో బలమైన నిరోధం ఉందని తెలిపారు. 

ఆయన సమీప కాలంలో మంచి రాబడిని అందించగల మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం.. 

బజాజ్‌ ఆటో
బజాజ్‌ ఆటో ప్రపంచపు మూడో అతిపెద్ద మోటార్‌సైకిల్స్‌ తయారీ కంపెనీ. త్రీవీలర్స్‌ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల కాలంలో కంపెనీ మంచి పనితీరు కనబర్చింది. మోటార్‌సైకిల్‌ విక్రయాలు 29 శాతం, వాణిజ్య వాహన అమ్మకాలు 41 శాతం పెరిగాయి. మొత్తం విక్రయాలు 30 శాతం ఎగశాయి. 2018 నవంబర్‌లో మోటార్‌సైకిల్‌ అమ్మకాలు 31 శాతం పెరిగాయి. ప్రసుత్త ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో అధిక ముడిపదార్ధాల ధరల కారణంగా కంపెనీ మార్జిన్లపై కొంత ఒత్తిడి కనిపించింది. అయితే రెండో అర్ధ భాగంలో మార్జిన్లు మెరుగుపడొచ్చనే అంచనాలున్నాయి. మధ్యస్థం నుంచి దీర్ఘ కాలంలో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

సీమెన్స్‌
కంపెనీ ఎలక్ట్రిఫికేషన్‌, ఆటోమేషన్‌, డిజిటలైజేషన్‌ వంటి వాటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.  విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన కంబైన్డ్‌ సైకిల్‌ టర్బైన్స్‌, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సొల్యూషన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సొల్యూషన్స్‌ ఫర్‌ స్మార్ట్‌ సిటీస్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌, ఆటోమేషన్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ వంటి వాటికి సాంకేతికతను అందించే ప్రముఖ కంపెనీల్లో ఇది ఒకటి. కంపెనీ పనితీరు బాగుంది. కొత్త ఆర్డర్లు ఆరోగ్యకరంగా ఉన్నాయి. మధ్యస్థః నుంచి దీర్ఘకాలం లక్ష్యంతో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు.

జీఎస్‌ఎఫ్‌సీ
ఫెర్టిలైజర్స్‌, బల్క్‌ ఇండస్ట్రీయల్‌ కెమికల్స్‌ తయారీలో దేశంలోనే ప్రముఖ కంపెనీల్లో ఇది ఒకటి. నైట్రోజెనస్‌ అండ్‌ ఫాస్పేట్‌ ఎరువుల తయారీలో అగ్రగామి. కంపెనీ మొత్తంగా 24 రకాల ఫెర్టిలైజర్‌ ప్రొడక్టులను తయారు చేస్తోంది. కార్పొలాక్టమ్‌, మెలమైన్‌, మెక్‌-ఆక్సిమ్‌, హైడ్రోక్సిలమైన్‌ సల్ఫేట్‌ క్రిస్టల్‌ వంటి ఇండస్ట్రీయల్‌ కెమికల్స్‌ తయారీలో టాప్‌లో ఉంది. కంపెనీ ప్రస్తుత క్యూ2లో బలమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 183 శాతం పెరిగింది. అందువల్ల ఈ స్టాక్‌ను మధ్యస్థం నుంచి దీర్ఘకాల లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చు. You may be interested

ఎగ్జిట్‌ పోల్స్‌పై మార్కెట్‌ ఏమంటోంది?

Monday 10th December 2018

ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రధాని నరేంద్ర మోదీ హవాపై సందేహాలను లెవనెత్తిన తరుణంలో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు పోటాపోటీగా ఉన్నాయని ఆరు ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. మూడు ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ ముందంజలో ఉందని పేర్కొంటే.. మిగిలిన ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపాయి. విజేతలు ఎవరనేది మంగళవారం తెలిపోతుంది.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50

ఐఓసీ షేర్లకు బైబ్యాక్‌ ఆఫర్‌ జోష్‌

Monday 10th December 2018

ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ జోష్‌తో ప్రభుత్వరంగ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) షేర్లు మార్కెట్‌ నష్టాలకు ఎదురీదుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు, ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఐఓసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూ, షేరుపై మధ్యంతర డివిండెండ్‌ ప్రకటనపై చర్చించేందుకు కంపెనీ

Most from this category